Jagananna Amma Vodi: ఎన్నికల కోడ్ ఉన్నా ‘అమ్మఒడి’ పథకం యథాతథం.. స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నా 'అమ్మఒడి' పథకం యథాతథంగా అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఈ పథకం కింద రూ.6,161 కోట్లను జమ చేస్తామని తెలిపారు.
Jagananna Amma Vodi: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నా ‘అమ్మఒడి’ పథకం యథాతథంగా అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఈ పథకం కింద రూ.6,161 కోట్లను జమ చేస్తామని తెలిపారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు ‘అమ్మఒడి’ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి తెలిపారు. మరోవైపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరును మంత్రి సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ ఇస్తున్న సూచనలు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పాటించరా..? అని ప్రశ్నించారు. షెడ్యూల్ విడుదల చేయడం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు.
ఇక ఏపీలో ఈనెల 18 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభంకానున్నాయని మంత్రి చెప్పారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఏడాదికి ఆఫ్‌లైన్‌లోనే మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నామని.. కానీ, వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్లో జరుపుతామని ఆయన తెలిపారు. త్వరలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పరీక్షలు వచ్చే ఏప్రిల్, మేలో జరిగే అవకాశముందని.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు.
Also Read : పోలీస్ ఇన్‌ఫార్మర్ల నెపంతో చంపితే ప్రతిఘటిస్తాం, మావోయిస్టులను హెచ్చరిస్తూ అల్లూరి ఆదివాసీ సమితి పోస్టర్లు