అతిగా చికెన్ తింటున్నారా… జాగ్రత్త!

కొంతమందికి రోజూ చికెన్ లేనిదే ముద్ద దిగదు. అయితే చికెన్ అతిగా తింటే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సూపర్ మార్కెట్లలో అమ్మే చికెన్‌లో హానికారక ‘ క్యాంపిలోబ్యాక్టర్ ‘ అనే వైరస్ ఉన్నట్టు ఇటీవల ఓ అధ్యయనంలో కనుగొన్నారు. పెద్ద స్టోర్లలో విక్రయించే కోడి మాంసంలోనూ సగం వరకు ఈ బ్యాక్టీరియా ఉంటుందని గుర్తించారు. ఈ బ్యాక్టీరియా అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జబ్బుల బారిన పడిన కోళ్ళ చికిత్స కోసం రైతులు వాడే యాంటీ-బయోటిక్ […]

అతిగా చికెన్ తింటున్నారా... జాగ్రత్త!
Follow us

| Edited By:

Updated on: May 12, 2019 | 4:45 PM

కొంతమందికి రోజూ చికెన్ లేనిదే ముద్ద దిగదు. అయితే చికెన్ అతిగా తింటే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సూపర్ మార్కెట్లలో అమ్మే చికెన్‌లో హానికారక ‘ క్యాంపిలోబ్యాక్టర్ ‘ అనే వైరస్ ఉన్నట్టు ఇటీవల ఓ అధ్యయనంలో కనుగొన్నారు. పెద్ద స్టోర్లలో విక్రయించే కోడి మాంసంలోనూ సగం వరకు ఈ బ్యాక్టీరియా ఉంటుందని గుర్తించారు.

ఈ బ్యాక్టీరియా అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జబ్బుల బారిన పడిన కోళ్ళ చికిత్స కోసం రైతులు వాడే యాంటీ-బయోటిక్ మందుల వల్ల కూడా ఈ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతోందని పరిశోధనల్లో తేలింది. అందువల్ల చికెన్‌ను ఎక్కువగా తినేవారు కాస్త తగ్గించుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నారు.