నకిలీ వాహనాల పాసుల కలకలం.. ఇద్దరు అరెస్ట్.. !

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉండిపోయింది. దీంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. లాక్ డౌన్ సడలింపులతో

నకిలీ వాహనాల పాసుల కలకలం.. ఇద్దరు అరెస్ట్.. !

Duplicate vehicle pass: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉండిపోయింది. దీంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. లాక్ డౌన్ సడలింపులతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలో విశాఖలో వాహనాల నకిలీ పాసుల కేసు కలకలం సృష్టిస్తోంది. డీజీ ఆఫీస్ నుంచి పోలీసులు జారీచెసే వాహనాల ఒరిజినల్ పాస్ స్కాన్ చేసి.. వివరాలు మార్చి కేటుగాళ్ళు సొమ్ముచేసుకుంటున్నారు. ఒక్కో నకిలీపాసును రూ.3 వేల నుంచి 6 వేలకు అమ్ముతున్నారు. కాగా.. వీరు డిమాండ్ ఉన్న ఇతరరాష్ట్రాల పాస్ లనే టార్గెట్ చేస్తున్నారు.

ఈ నకిలీ పాసుల వ్యవహారంలో అశోక్ జైన్, జెటి రామారావు అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 420, 466, 468 రెడ్ విత్ 34 ఐపీసీ, ఐటీ యాక్ట్ లను నమోదు చేశారు ఎమ్మార్ పేట పోలీసులు. నకిలీ పాస్ లను సీజ్ చేశారు. నిందితులు దాదాపు 30 నుంచి 40 ఫేక్ పాస్ లను సృష్టించారు. జెటి రామారావు స్వచ్గ్చంద సేవకుడిగా పోలీసులతో సఖ్యతగా ఉంటూనే మోసాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా జెటి రామారావుపై పలు కేసులు నమోదయ్యాయి.