సిరియాలో యుధ్ధ మేఘాలు.. ట్రంప్ మండిపాటు

టర్కీ-సిరియా మధ్య మెల్లగా యుధ్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి. సిరియాలో క్రమేపీ టర్కీ సైనిక దళాలు ప్రవేశిస్తున్నాయి. ఎనిమిదేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న అంతర్యుధ్ధం ముదిరి పాకాన పడేట్టు కనిపిస్తోంది. తమ దేశ(సిరియా) సరిహద్దుల్లోని దాదాపు 36 లక్షల మంది శరణార్థులను తిప్పి పంపివేయడానికి సిరియా చేస్తున్న యత్నాలను టర్కీ ఖండిస్తోంది. సరిహద్దుల్లో ఓ సేఫ్ జోన్ ఏర్పాటు చేయాలన్న తమ ప్రతిపాదనకు సిరియా అడ్డుకుంటోందని టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యప్ ఎర్డోగాన్ ఆరోపిస్తున్నారు. ఈ […]

సిరియాలో యుధ్ధ మేఘాలు.. ట్రంప్ మండిపాటు
Follow us
Anil kumar poka

|

Updated on: Oct 08, 2019 | 1:47 PM

టర్కీ-సిరియా మధ్య మెల్లగా యుధ్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి. సిరియాలో క్రమేపీ టర్కీ సైనిక దళాలు ప్రవేశిస్తున్నాయి. ఎనిమిదేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న అంతర్యుధ్ధం ముదిరి పాకాన పడేట్టు కనిపిస్తోంది. తమ దేశ(సిరియా) సరిహద్దుల్లోని దాదాపు 36 లక్షల మంది శరణార్థులను తిప్పి పంపివేయడానికి సిరియా చేస్తున్న యత్నాలను టర్కీ ఖండిస్తోంది. సరిహద్దుల్లో ఓ సేఫ్ జోన్ ఏర్పాటు చేయాలన్న తమ ప్రతిపాదనకు సిరియా అడ్డుకుంటోందని టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యప్ ఎర్డోగాన్ ఆరోపిస్తున్నారు. ఈ బోర్డర్లో కొన్ని వారాలుగా సాగుతున్న తమ దేశ సైనిక కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన.. ఎలాంటి ముందస్తు హెచ్చరికా లేకుండా తమ భద్రతా దళాలు సిరియాలో ప్రవేశిస్తాయని పేర్కొన్నారు. ‘ ఆక్రమణ ఏ సమయంలోనైనా జరగొచ్చు ‘ అని వార్నింగ్ ఇచ్చారు. ఇక మన ‘ పెద్దన్న ‘ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగారు. సిరియాపై మీరు మరీ దూకుడుగా వ్యవహరిస్తున్నారని టర్కీని దుమ్మెత్తిపోశారు. టర్కీ సైనికులకు, కుర్దుల ఆధ్వర్యంలోని సిరియన్ డెమొక్రటిక్ దళాలకు మధ్య ‘ బఫర్ ‘ (వారధి) గా వ్యవహరిస్తున్న సుమారు రెండు డజన్ల సైనిక దళాలను పెంటగాన్ (అమెరికా రక్షణ వ్యవస్థ) ఉపసంహరించుకోవడంతో టర్కిష్ దళాలు ముందుకు చొచ్ఛుకువచ్ఛే ప్రయత్నం చేస్తున్నాయి. తమ దేశ సైనికులు ఇక అక్కడ ఉండబోరని ట్రంప్ తాజాగా ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. టర్కీ-సిరియా దేశాల మధ్య రగులుతున్న ఉద్రిక్తతపట్ల ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఇటు రిపబ్లికన్లు, అటు డెమొక్రాట్లు విమర్శల వర్షం కురిపిస్తుండడంతో ఈయన వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది. టర్కీ ఒకవేళ హద్దు మీరి వ్యవహరిస్తే ఆ దేశ ఆర్ధిక పరిస్థితిని సమూలంగా తుడిచిపెట్టేస్తామని ట్రంప్ తీవ్రంగా హెచ్ఛరించారు. ఏమైనా ‘ ఒక ముగింపు అంటూ లేని ‘, ‘ తమాషా యుధ్ధాలకు స్వస్తి చెబుదాం అని ట్రంప్ ట్వీటించారు.

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. ఏడుగురు జవాన్లు మృతి..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. ఏడుగురు జవాన్లు మృతి..
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు
మకర సంక్రాంతి రోజున స్నానం, దానానికి శుభ సమయం ఎప్పుడు?
మకర సంక్రాంతి రోజున స్నానం, దానానికి శుభ సమయం ఎప్పుడు?
ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..
ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు