AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా దిగివచ్చిన బంగారం ధరలు… ఈ రోజు పసిడి ధర రూ.1,049 తగ్గి రూ.48,569 వద్ద స్థిరపడింది

దేశీయ మార్కెట్​లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.1,049 తగ్గి రూ.48,569 వద్ద స్థిరపడింది. వెండి ధర కూడా కిలోకు రూ.1,588 క్షీణించి రూ.59,301కు దిగొచ్చింది.

భారీగా దిగివచ్చిన బంగారం ధరలు... ఈ రోజు పసిడి ధర రూ.1,049 తగ్గి రూ.48,569 వద్ద స్థిరపడింది
Sanjay Kasula
|

Updated on: Nov 24, 2020 | 5:42 PM

Share

దేశీయ మార్కెట్​లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.1,049 తగ్గి రూ.48,569 వద్ద స్థిరపడింది. వెండి ధర కూడా కిలోకు రూ.1,588 క్షీణించి రూ.59,301కు దిగొచ్చింది. కరోనా టీకా క్యాండిడేట్ల తయారీలో పురోగతితో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే ఆశలు పెరిగాయి.

అందువల్ల మదుపరులు ఇతర పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నారు. ​అధికార బదిలీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించడం, రూపాయి మారకం బలపడటం వంటి కారణాలతో బంగారం ధరలు తగ్గాయి. తపన్​ పటేల్, హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ విశ్లేషకుడు. అంతర్జాతీయ మార్కెట్​లో పసిడి ధర ఔన్సుకు 1,830 డాలర్లుగా ఉండగా.. వెండి ధర 23.42 డాలర్ల వద్ద ఉంది.