తల్లిని మించిన యోధులు ఎవ్వరూ ఉండరు… ఈ తల్లి కుక్క ఏం చేసిందో తెలుసా?

సృష్జిలో జీవి ఏదైనా సరే తల్లి ప్రేమ ఒక్కలాగే ఉంటుందని మరోసారి రుజువైంది. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ ఉండరంటూ ఇటీవల ఓ సినిమాలో బాగా ఫేమస్ అయిన డైలాగ్ గుర్తుకు వచ్చేలా ఓ తల్లి కుక్క  సాహసం  చేసింది.  ఓ  కుక్క తన పిల్లల్ని విషసర్పం నుంచి కాపాడుకోడానికి ఎంతో పోరాడింది. అయితే తన రెండు కుక్కపిల్లల్ని కాటు వేయడంతో అవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:21 pm, Sat, 12 October 19
తల్లిని మించిన యోధులు ఎవ్వరూ ఉండరు...  ఈ తల్లి కుక్క ఏం చేసిందో తెలుసా?

సృష్జిలో జీవి ఏదైనా సరే తల్లి ప్రేమ ఒక్కలాగే ఉంటుందని మరోసారి రుజువైంది. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ ఉండరంటూ ఇటీవల ఓ సినిమాలో బాగా ఫేమస్ అయిన డైలాగ్ గుర్తుకు వచ్చేలా ఓ తల్లి కుక్క  సాహసం  చేసింది.  ఓ  కుక్క తన పిల్లల్ని విషసర్పం నుంచి కాపాడుకోడానికి ఎంతో పోరాడింది. అయితే తన రెండు కుక్కపిల్లల్ని కాటు వేయడంతో అవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ నాగోల్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఓ కుక్క రెండు రోజుల క్రితమే మూడు కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. అది ఉంటున్న షెడ్డులోకి పాము ప్రవేశించడం చూసిన తల్లికుక్క పెద్దగా మొరుగుతూ పిల్లల్ని కాపాడుకోబోయింది. అప్పటికే బుసలు కొడుతున్న పాము .. కుక్క పిల్లల్ని కసిగా కాటువేయగా రెండు కుక్కపిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. దీంతో కుక్క మరింత గట్టిగా మొరగడంతో పాము అక్కడినుంచి మెల్లగా జారుకుంది. ఈ ఘటనలో మరో కుక్కపిల్ల ప్రాణాలతో బయటపడింది.

నాగోల్ ఆర్టీఏ కార్యాలయం వద్ద శుక్రవారం అంత చూస్తుండగానే ఆరున్నర అడుగుల నాగుపాము గోడ దాటి ఆదర్శ నగర్‌పై వెళ్లింది. దీన్ని గమనించి సెక్యూటీగార్డు స్ధానికులను అప్రమత్తం చేయడానికి వెళ్లేలోపు అక్కడున్న ఓ షెడ్డులో దూరింది. అక్కడ రెండు రోజుల క్రితమే ఓ కుక్క మూడు పిల్లలకు జన్మనిచ్చింది. పాము రాకను గమనించిన పెద్దగా అరవడంతో స్ధానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే పాముకాటుతో .. ఇంకా కళ్లు కూడా తెరవని తన రెండు పిల్లల్ని పోగొట్టుకుంది. ఈ ఘటనతో స్ధానికలు చలించిపోయారు.

నాగోల్ ఆర్టీఏ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో విష సర్పాలు విపరీతంగా తిరుగుతున్నాయి. కార్యాలయానికి వివిధ పనులమీద వచ్చేవారిని సైతం ఈ పాములు తరచూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. చుట్టూ పచ్చిక ఉండటంతో పాముల బెడద ఎక్కువుగా ఉందని కార్యాలయానికి వచ్చే వారు చెబుతున్నారు. ఇప్పటికైన పరిసరాల్లో ముళ్లపొదలు లేకుండా చూడాలని కోరుతున్నారు.