యువ‌తి క‌డుపులో 1.5 కిలోల జుట్టు

యువ‌తి క‌డుపులో 1.5 కిలోల జుట్టు

బెంగాల్, ఝార్​గ్రామ్‌లో ఓ యువతి కడుపులో నుంచి 1.5 కిలోల జ‌ట్టును శ‌స్త్ర‌చికిత్స చేసి వైద్యులు బయటకు తీశారు.

Ram Naramaneni

|

Aug 07, 2020 | 6:47 PM

Girl with hair in stomach : బెంగాల్, ఝార్​గ్రామ్‌లో ఓ యువతి కడుపులో నుంచి 1.5 కిలోల జ‌ట్టును శ‌స్త్ర‌చికిత్స చేసి వైద్యులు బయటకు తీశారు. తీవ్ర‌మైన‌ క‌డుపు నొప్పితో స్థానిక గ‌వ‌ర్న‌మెంట్ ఆస్పత్రిలో చేరింది 17 ఏళ్ల ఓ యువతి. వెంట‌నే స్కానింగ్, ఎక్స్‌రే తీసిన వైద్యులు ఆమె జీర్ణాశయంలో వెంట్రుకలున్నట్లు గుర్తించి, ఆప‌రేష‌న్ చేశారు.

Doctors remove 1.5 kg hair from stomach of a teenage girl in west bengal

కొద్దిరోజులగా మానసిక స‌మ‌స్య‌లతో బాధపడుతున్న యువ‌తి.. గట్టిగట్టిగా ఏడుస్తూ, తన జుట్టును తానే తినేసిందని…అలా రోజుకు కొన్ని వెంట్రుకలు ఆమె కడుపులో పేరుకుపోయాయని డాక్ట‌ర్లు తెలిపారు. వాటిని తీయకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం వాటిల్లే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించారు.

Read More :  ఎమ్మెల్యే శ్రీదేవి గొప్ప మ‌న‌సు : గాయ‌ప‌డ్డ వ్య‌క్తికి రోడ్డుపైనే ప్రాథ‌మిక‌ వైద్యం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu