ఇకపై డీఎంకేకు పీకే సేవలు..గెలుపే లక్ష్యంగా పావులు

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌…దేశ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌ అయ్యారు. స్ట్రాటజిస్టుగా 99 శాతం సక్సెస్ రేటుతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్‌కు వ్యూహకర్తగా ఉన్నారు. తాజాగా ప్రశాంత్ కిశోర్‌కి చెందిన ‘ఐప్యాక్‌’ సంస్థతో తమ పార్టీ కలిసి పనిచేస్తుందని డీఎంకే చీఫ్  ఎంకే స్టాలిన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 2021లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఐప్యాక్‌ సంస్థ తమకు సేవలందిస్తుందని తెలిపారు. 2021 ఎలక్షన్స్‌లో తమ పార్టీ ప్రణాళికకు […]

ఇకపై డీఎంకేకు పీకే సేవలు..గెలుపే లక్ష్యంగా పావులు

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌…దేశ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌ అయ్యారు. స్ట్రాటజిస్టుగా 99 శాతం సక్సెస్ రేటుతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్‌కు వ్యూహకర్తగా ఉన్నారు. తాజాగా ప్రశాంత్ కిశోర్‌కి చెందిన ‘ఐప్యాక్‌’ సంస్థతో తమ పార్టీ కలిసి పనిచేస్తుందని డీఎంకే చీఫ్  ఎంకే స్టాలిన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 2021లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఐప్యాక్‌ సంస్థ తమకు సేవలందిస్తుందని తెలిపారు. 2021 ఎలక్షన్స్‌లో తమ పార్టీ ప్రణాళికకు మెరుగులు దిద్ది తమిళనాడుకు పూర్వ వైభవం తెచ్చేందుకు సహాయపడతారని స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు

రాబోయే సంవత్సరంలో జరిగే  తమిళనాడులో ఎన్నికల్లో.. ఐప్యాక్‌ తమిళనాడు టీమ్… డీఎంకే గెలుపు కోసం కృషి చేస్తుందని ఐప్యాక్ సంస్థ తెలిపింది. డీఎంకేతో కలిసి పనిచేయడం కోసం.. ఐప్యాక్‌ తమిళనాడు టీమ్ ఉత్సాహంగా ఉందని..పార్టీకి  ఘన విజయం కోసం కృషి చేస్తుందని ట్విట్టర్‌లో పేర్కొంది. తమకు అవకాశం కల్పించిన స్టాలిన్‌కు ఐప్యాక్ సంస్థ ధన్యవాాదాలు తెలిపింది.

I-PAC వెబ్‌సైట్ ప్రకారం, ఈ బృందం తన భాగస్వాములకు “పౌర-కేంద్రీకృత అజెండాను సెట్ చేయడానికి”, “అజెండాను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి, ప్రజల మద్దతును సేకరించే అత్యంత ప్రభావవంతమైన పద్ధతులను అమలు చేయడానికి” సహాయపడుతుంది. కిషోర్ ఇంతకుముందు 2014 లో ప్రధాని నరేంద్ర మోడీ, 2015 లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, 2017 లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఎన్నికల ప్రచారాలను విజయవంతంగా నిర్వహించారు. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీని 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించేలా కృషి చేశారు. అయితే, 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసిన పీకేకు తొలి పరాభవం ఎదురైంది.

Published On - 8:06 am, Mon, 3 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu