ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌక వివాదంలో కొత్త ట్విస్ట్!

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ, ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌక వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. భారత యుద్ధనౌకను రాజీవ్ గాంధీ తన విహారానికి వాడుకున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలు చేయడంతో ఈ వివాదం రేగింది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ను ఈ వ్యవహారంలోకి లాగుతూ కాంగ్రెస్ నేత దివ్య స్పందన వ్యాఖ్యానించడంతో ఇది ఆసక్తికర మలుపు తిరిగింది. యుద్ధనౌకను వినియోగించినప్పుడు ఏం జరిగిందో అమితాబ్‌కి తెలుసుననీ.. ఈ వ్యవహారంపై […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:37 pm, Thu, 9 May 19
ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌక వివాదంలో కొత్త ట్విస్ట్!

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ, ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌక వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. భారత యుద్ధనౌకను రాజీవ్ గాంధీ తన విహారానికి వాడుకున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలు చేయడంతో ఈ వివాదం రేగింది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ను ఈ వ్యవహారంలోకి లాగుతూ కాంగ్రెస్ నేత దివ్య స్పందన వ్యాఖ్యానించడంతో ఇది ఆసక్తికర మలుపు తిరిగింది. యుద్ధనౌకను వినియోగించినప్పుడు ఏం జరిగిందో అమితాబ్‌కి తెలుసుననీ.. ఈ వ్యవహారంపై ఆయన నిజాలు వెల్లడించాలని ఆమె కోరారు.

ఈ సందర్భంగా ఐఏఎస్‌ మాజీ అధికారి హబీబుల్లా వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. ఐఎన్‌ఎస్ విరాట్ 1984లో లక్షద్వీప్ వద్ద ఉన్నప్పుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, ఆయన సన్నిహితులు ఆ ద్వీపంలో ఉన్న సమయంలో హబీబుల్లా ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం..ఆ ద్వీపంలో రాజీవ్ తో పాటు అమితాబ్ ఇతర సన్నిహితులు కూడా ఉన్నారని, వారి ప్రయాణానికి వ్యక్తిగత హెలికాప్టర్‌ను ఉపయోగించారని, ఈ యుద్ధ నౌకను కాదని ఆ పత్రిక పేర్కొంది. దాన్ని ఉద్దేశించి దివ్య స్పందన ట్విటర్‌ వేదికగా అమితాబ్‌ బచ్చన్‌ను వాస్తవాలు వెల్లడించారని కోరారు. ‘వాస్తవాలు వెల్లడించండి. ఈ సమయంలో మీపై మాట్లాడమని ఒత్తిడి తెస్తున్నారని భావించొద్దు’ అని ఆమె ట్వీట్‌ చేశారు.