కిడారి శ్రవణ్‌ రాజీనామాకు గవర్నర్‌ ఆమోదం

అమరావతి: మంత్రి పదవికి కిడారి శ్రవణ్‌ చేసిన రాజీనామాను గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించారు. మంత్రిగా సేవలందించిన శ్రవణ్‌కు గవర్నర్‌ ధన్యవాదాలు తెలిపారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేత ఆరు నెలల్లో చట్ట సభల్లో సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. అయితే ఈనెల 10తో ఆ గడువు ముగుస్తుండటం.. ఇప్పటివరకు ఏ సభలోనూ సభ్యుడిగా ఎన్నిక కాకపోవడంతో శ్రవణ్‌ రాజీనామా చేశారు. రాజీనామాకు ముందు ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన ఆయన.. మంత్రి లోకేశ్‌తో చర్చించారు. అనంతరం నేరుగా […]

కిడారి శ్రవణ్‌ రాజీనామాకు గవర్నర్‌ ఆమోదం
Follow us

|

Updated on: May 09, 2019 | 9:22 PM

అమరావతి: మంత్రి పదవికి కిడారి శ్రవణ్‌ చేసిన రాజీనామాను గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించారు. మంత్రిగా సేవలందించిన శ్రవణ్‌కు గవర్నర్‌ ధన్యవాదాలు తెలిపారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేత ఆరు నెలల్లో చట్ట సభల్లో సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. అయితే ఈనెల 10తో ఆ గడువు ముగుస్తుండటం.. ఇప్పటివరకు ఏ సభలోనూ సభ్యుడిగా ఎన్నిక కాకపోవడంతో శ్రవణ్‌ రాజీనామా చేశారు. రాజీనామాకు ముందు ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన ఆయన.. మంత్రి లోకేశ్‌తో చర్చించారు. అనంతరం నేరుగా సచివాలయానికి వెళ్లి లేఖను సీఎం కార్యాలయ అధికారులకు సమర్పించారు.