AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digbala Yoga 2026: దిగ్బల యోగంతో వీరికి కెరీర్‌లో గోల్డెన్ డేస్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

జ్యోతిషశాస్త్రంలో దిగ్బల యోగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి దిగ్బల యోగం ఏర్పడిందని జ్యోతిష్య నమ్మకం. ఈ యోగం ప్రభావంతో ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంలో పురోగతి ఉంటుందని భావిస్తున్నారు.

Digbala Yoga 2026: దిగ్బల యోగంతో వీరికి కెరీర్‌లో గోల్డెన్ డేస్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Digbala Yoga 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 01, 2026 | 12:02 PM

Share

జ్యోతిషశాస్త్రంలో దిగ్బల యోగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. లగ్నంలో లేదా చంద్రుడున్న రాశిలో బుధుడు లేదా గురువు, చతుర్థ స్థానంలో శుక్రుడు లేదా చంద్రుడు, సప్తమ స్థానంలో శని, దశమ స్థానంలో కుజుడు లేదా రవి ఉన్నప్పుడు దిగ్బల యోగం పడుతుంది. ఈ దిగ్బలం పట్టిన కాలంలో తప్పనిసరిగా ఏదో ఒక విధమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పైకి రావడం, వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపట్టడం, ఆదాయం వృద్ధి చెందడం, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం, ఆరోగ్యం మెరుగుపడడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ప్రస్తుతం దిగ్బల యోగం పట్టిన రాశుల్లో కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశులున్నాయి.

కర్కాటక రాశి

ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి జనవరి 2వరకు కెరీర్ పరంగా, ఆదాయపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజ సేవా కార్యక్రమాలు పెరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరి ష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి.

సింహ రాశి

ఈ రాశిలో ఈ నెల 31 నుంచి గురు సంచారం వల్ల దిగ్బల యోగం పట్టింది. జనవరి 25 వరకు కొనసాగే ఈ యోగం వల్ల ఈ రాశివారికి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. గృహ, వాహన యోగాలకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కన్య రాశి

ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం పట్టింది. దీనివల్ల ఊహించని ఆదాయ వృద్ధి ఉంటుంది. రాజకీయంగా ప్రాబల్యం ఏర్పడుతుంది. రాజకీయ ప్రము ఖులు, ఉన్నతాధికారులతో పరిచయాలు పెరుగుతాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయం కావడం గానీ, ప్రేమలో పడడం గానీ జరుగుతుంది. ఏ రంగంలో ఉన్నా శీఘ్ర పురో గతి ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి. పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి.

తుల రాశి

ఈ రాశిలో ఉన్న బుధుడి వల్ల, దశమ స్థానంలో ఉన్న కుజుడి వల్ల రెండు విధాలుగా ఈ రాశి వారికి దిగ్బల యోగం పట్టింది. మరో నెల రోజుల పాటు కొనసాగే ఈ యోగం వల్ల ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతికి ఆస్కారముంటుంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఉద్యోగం లభిస్తుంది. సామాజిక హోదా కూడా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లను మించిపోవడం జరుగుతుంది. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

వృశ్చికం

ఈ రాశికి దశమ స్థానంలో కుజుడి ప్రవేశం వల్ల నవంబర్ 12 నుంచి నెల రోజుల పాటు దిగ్బల యోగం కలిగింది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. ప్రము ఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఏ రంగంలో ఉన్నా శీఘ్ర పురోగతి ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది.

మకరం

ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల నవంబర్ 17 వరకు ఈ రాశివారికి దిగ్బల యోగం పట్టింది. దీనివల్ల రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నతోద్యోగం లభించడానికి అవకాశం లభిస్తుంది. సామాజికంగా స్థాయి, హోదా పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి, వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.

Follow Us
పేదల ఓట్లను తొలగిస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
పేదల ఓట్లను తొలగిస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
డివైడర్‌ను ఢీకొట్టి ఆపోజిట్‌ రోడ్డులో కారు బోల్తా.. స్పాట్‌లోనే
డివైడర్‌ను ఢీకొట్టి ఆపోజిట్‌ రోడ్డులో కారు బోల్తా.. స్పాట్‌లోనే
టాస్ గెలిచిన కివీస్.. ఇండియా బ్యాటింగ్
టాస్ గెలిచిన కివీస్.. ఇండియా బ్యాటింగ్
ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆయనే.. నా కూతురికి కూడా..
ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆయనే.. నా కూతురికి కూడా..
కార్తీక మాసంలో ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..!
కార్తీక మాసంలో ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..!
రోహిత్ ఎలిమినేషన్ ట్విస్ట్: సీక్రెట్ రూమ్ ఆఫర్ రిజెక్ట్..
రోహిత్ ఎలిమినేషన్ ట్విస్ట్: సీక్రెట్ రూమ్ ఆఫర్ రిజెక్ట్..
చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..
చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..
కేవలం రూ.400కే వాటర్ ట్యాంకర్.. హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్
కేవలం రూ.400కే వాటర్ ట్యాంకర్.. హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్
చికెన్‌తో మస్త్ కాంబినేషన్ ఈ చారు.. దెబ్బకు జలుబు, దగ్గు మటాష్
చికెన్‌తో మస్త్ కాంబినేషన్ ఈ చారు.. దెబ్బకు జలుబు, దగ్గు మటాష్
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..