Dengue Cases: కరోనా బాధితుల్లో కొత్త గుబులు.. వానాకాలంలో వణికిస్తున్న సీజనల్ వ్యాధులు..

కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వైపు వర్షాలు పడుతుండడంతో సీజనల్ వ్యాధులు భయపెడుతున్నాయి.

Dengue Cases: కరోనా బాధితుల్లో కొత్త గుబులు.. వానాకాలంలో వణికిస్తున్న సీజనల్ వ్యాధులు..
Covid 19 Disease On Platelets
Follow us

|

Updated on: Jul 30, 2021 | 6:08 PM

COVID-19 Disease on Platelets: కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వైపు వర్షాలు పడుతుండడంతో సీజనల్ వ్యాధులు భయపెడుతున్నాయి. ఈ టైంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా వానాకాలంలో డెంగీ, టైఫాయిడ్, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు సాధారణమే. అయితే, కోవిడ్ సెకండ్ వేవ్​లో చాలా మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో చాలామందికి డెంగీ అటాక్ అవుతుందని, వచ్చిన వారిలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకేసారి కరోనా, డెంగీ రెండు ఇన్​ఫెక్షన్ల బారినపడితే వారిని కో ఇన్​ఫెక్షన్ ​పేషెంట్​గా గుర్తించి ట్రీట్​మెంట్​ అందిస్తున్నామన్నారు.

కేసులు తగ్గాయి.. కరోనా పోయింది అనుకుంటే పొరపాటే అంటున్నారు వైద్యులు. వర్షాలు కురుస్తున్నాయి ఇలాంటి టైం లోనే చాలా జాగ్రత్త ఉండాలని అంటున్నారు .కరోనా వచ్చిన వారు సీజనల్ వ్యాధుల తో జాగ్రత గా ఉండాలని అంటున్నారు. తీవ్ర జర్వం వచ్చి ఒక్కసారిగా ప్లేట్ లెట్స్ పడిపోతున్నాయనీ.. ఇలాంటి కేసులు గ్రేటర్​లో రెండు వారాలుగా ఎక్కువగా నమోదవుతున్నాయి అంటున్నారు వైద్యులు. డెంగీ, కరోనాలో జ్వరం, తలనొప్పి, దగ్గు, జలుబు, విరేచనాలు సాధారణంగా ఉంటాయంటున్నారు. డెంగీ వస్తే 4 రోజుల తర్వాత తగ్గిపోతుందని, జ్వరం తగ్గాక పేషెంట్లు వెంటనే ఇంటికెళ్లకుండా మరో రెండ్రోజులు ఆస్పత్రిలో ఉండాలంటున్నారు. ఇన్​ఫెక్షన్​అప్పుడే మొదలవుతుందని, వెంటనే ట్రీట్​మెంట్​ అందించాల్సి ఉంటుందని చెప్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి కేసులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటే ప్రైవేటులోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. డైలీ ఓపీకి వచ్చే పేషెంట్లలలో వీళ్లే ఎక్కువ ఉంటున్నారు. కరోనా వచ్చిపోయిన వారితో పాటు, ప్రస్తుతం పాజిటివ్ పేషెంట్లకు సీజనల్ వ్యాధులు సోకితే డేంజరేనని డాక్టర్లు చెబుతున్నారు. పోస్ట్​ కొవిడ్ ​పేషెంట్లకు డెంగీ వస్తే తీవ్రత ఎక్కువ ఉంటుంది.

ముఖ్యంగా కోవిడ్​ పేషెంట్లను డెంగీ భయపెడుతోంది. తీవ్ర జర్వం వచ్చి ఒక్కసారిగా ప్లేట్ లెట్స్ పడిపోతున్నాయి. ఇలాంటి కేసులు గ్రేటర్​లో రెండు వారాలుగా ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా వచ్చిపోయిన వారు, కరోనా పాజిటివ్ పేషెంట్లు ఫీవర్​తో ఆస్పత్రులకు వెళ్తుండగా డాక్టర్లు ముందుగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి రిజల్ట్ ని బట్టి వేరే టెస్టులు చేస్తుండగా డెంగీ సోకినట్లు తేలుతోంది. వెంటనే అబ్జర్వేషన్​లో ఉంచుకుని ట్రీట్ మెంట్​అందిస్తున్నారు. సిటీలో ఇలాంటి కేసులు ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటులోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. డైలీ ఓపీకి వచ్చే పేషెంట్లలో ఐదారుగురు వీళ్లే ఉంటున్నారు. కరోనా వచ్చిపోయిన వారితో పాటు, ప్రస్తుతం పాజిటివ్ పేషెంట్లకు కూడా డెంగీ సోకితే డేంజరేనని డాక్టర్లు పేర్కొంటున్నారు. డెంగీ వస్తే మొదటి నాలుగు రోజులు తలనొప్పి, విరేచనాలు, ఫీవర్ ఉంటాయని, లేట్ చేయకుండా డాక్టర్​అబ్జర్వేషన్ లో ఉంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. హెల్త్ కండీషన్ పై అలర్ట్​గా ఉండాలని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు.

ఇదిలావుంటే, థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తైంది.ప్రభుత్వ ఆసుపత్రుల తో పాటు, ప్రైవేట్ ఆసుపత్రలలో వంద పడకల పైన ఉన్న ఆసుపత్రులలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్లాంట్ లు ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో గుర్తింపు ఉన్న ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో తప్పనిసరిగా ఆక్సిజన్ ఫ్లాంట్లు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించామన్నారు. గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్ల కెపాసిటీకి తగిన మొత్తంలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయని ఆస్పత్రుల గుర్తింపును రద్దు చేస్తామన్నారు. ప్రాణ వాయువు ఫ్లాంట్ల కోసం నెల రోజుల గడువు ఇచ్చినట్లు శ్రీనివాస రావు తెలిపారు.

Read Also….

Telangana: ప్రైవేట్ ఆసుపత్రులకు తెలంగాణ సర్కార్ కొత్త షరతు.. అది లేకుంటే లైసెన్స్ రద్దు..!

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో