ఫేస్‌బుక్ పరిచయం… బలవబోయిన బాలిక జీవితం… కిడ్నాప్ చేసిన యువకుడు… కుటుంబంతో సహా పరార్….
ఢిల్లీ కి చెందిన 15 ఏళ్ల బాలికకు ఫేస్‌బుక్ వేదికగా రాజస్తాన్‌కు చెందిన షోయబ్ ఖాన్ అనే యువకుడు దొంగ ఐడీతో పరిచయమయ్యాడు. తరచు ఆ బాలికతో చాటింగ్ చేసే వాడు. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసేవాడు.
సోషల్ మీడియా వేదిక సాగిన స్నేహం ఆ అమ్మాయి పాలిట శత్రువులా మారింది. నమ్మి చేసిన చెలిమి వొమ్మైంది… కలుద్దామని వస్తే ఏకంగా కిడ్నాప్‌కు గురైంది.. ఈ సినిమాను తలపించే ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా..?
ఢిల్లీ కి చెందిన 15 ఏళ్ల బాలికకు ఫేస్‌బుక్ వేదికగా రాజస్తాన్‌కు చెందిన షోయబ్ ఖాన్ అనే యువకుడు దొంగ ఐడీతో పరిచయమయ్యాడు. తరచు ఆ బాలికతో చాటింగ్ చేసే వాడు. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసేవాడు. ఈ క్రమంలో అక్టోబర్ 22న ఢిల్లీకి వచ్చాడు. కలుద్దాం రా అని పిలిచి సదరు బాలికను కిడ్నాప్ చేశాడు. తర్వాత ఆ బాలికను బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ తిప్పి చివరకు ఓ ఆటో రిక్షాలో బాదాపూర్ పరిసర ప్రాంతాల్లో అక్బోబర్ 26న వొదిలేసి వెళ్లాడు.
కేసు ఛేదన ఇలా…
సదరు బాలిక తండ్రి తన కూతురు కనిపించడం లేదని అక్టోబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ మొదలుపెట్టిన పోలీసులు బాలిక సోషల్ మీడియా అకౌంట్లను వెతికారు. ఫేస్‌బుక్ వేదిక ఎస్‌కే సిన్హా పేరుతో ఉన్న వ్యక్తితో తరచూ చాట్ చేస్తున్నట్లు గుర్తించారు. కానీ, ఆ ఫేస్‌బుక్ ఐడీ కూడా ఫేక్ అని పోలీసులు తేల్చారు. అయితే ఆ ఐడీని రాజస్తాన్‌కు చెందిన షోయబ్ ఖాన్‌దిగా గుర్తించారు. అతడి కోసం రాజస్తాన్‌లోని అతడి గ్రామంలో వెతకగా… సదరు నిందితుడు కుటుంబ సభ్యులతో సహా పారిపోయాడు. చాలా రోజుల వెతుకులాట తర్వాత నిందితుడు బాదాపూర్ పరిసర ప్రాంతాల్లో దొరికాడు. పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.