ఫైన్ వేశారని..నడిరోడ్డుపై బైక్ తగులబెట్టాడు

గత ఏడాది సెప్టెంబర్ నుంచి నూతన మోటర్ వెహికల్ చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి వాహన నిబంధనలు పాటించని వారిపై కొరడా ఝులిపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.  భారీగా ఫైన్లు వడ్డిస్తూ..ట్రాఫిక్ నియమాలను కఠినతరంగా అమలయ్యేలా చూస్తున్నారు. కానీ ఈ ఫైన్స్‌పై కొందరు వ్యక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వేసే ఫైన్స్ చూసి ఒక్కోసారి వాహనదారులకు మతి పోతుంది. దీంతో ఏం చెయ్యాలో తెలియక వారి సొంత బైక్స్‌ పైనే ప్రతాపం చూపిస్తున్నారు. భారీ […]

ఫైన్ వేశారని..నడిరోడ్డుపై బైక్ తగులబెట్టాడు
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 02, 2020 | 4:13 PM

గత ఏడాది సెప్టెంబర్ నుంచి నూతన మోటర్ వెహికల్ చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి వాహన నిబంధనలు పాటించని వారిపై కొరడా ఝులిపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.  భారీగా ఫైన్లు వడ్డిస్తూ..ట్రాఫిక్ నియమాలను కఠినతరంగా అమలయ్యేలా చూస్తున్నారు. కానీ ఈ ఫైన్స్‌పై కొందరు వ్యక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు వేసే ఫైన్స్ చూసి ఒక్కోసారి వాహనదారులకు మతి పోతుంది. దీంతో ఏం చెయ్యాలో తెలియక వారి సొంత బైక్స్‌ పైనే ప్రతాపం చూపిస్తున్నారు. భారీ ఫైన్స్ వేశారని ఇప్పటివరకు కొందరు వ్యక్తులు పోలీసుల వద్దే బైక్స్ వదిలేసి వెళ్లిపోగా, తాజాగా ఓ యువకుడు నడిరోడ్డుపైనే సొంత  బైక్‌ను తగులబెట్టాడు. వివర్లాలోకి వెళ్తే..ఢిల్లిలోని సంగమ్ విహార్‌కు చెందిన వికాస్ అనే వ్యక్తి నూతన సంవర్సరం రోజున ప్రెండ్స్‌తో ఎంజాయ్ చెయ్యడానికి బైక్‌పై బయటకు వెళ్లాడు. గ్రేటర్ కైలాష్ ఏరియాలో ట్రాఫిక్ చెకింగ్స్ చేస్తోన్న పోలీసులు వికాస్ వాహనాన్ని ఆపి డాక్యుమెంట్లు పరిశీలించారు. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చెయ్యడంతో ఫైన్ వెయ్యడమే కాకుండా గతంలో ఉన్న చలాన్ల దృష్ట్యా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన వికాస్..అక్కడిక్కడే బైక్‌కు నిప్పంటించాడు. ఈ హఠాత్పరిణామంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పలు రాష్ట్రాలు ఇంకా నూతన చట్టాన్ని అమలు చేయడం లేదు.