పెద్దల ముందు గొడవ జరగడం మంచిదే: ‘మా’ రభసపై తమ్మారెడ్డి
ఆధిపత్య పోరు వల్లే మా అసోషియేషన్‌లో గొడవలు జరుగుతున్నాయని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. మా రభసపై స్పందించిన తమ్మారెడ్డి.. పెద్దల ముందు గొడవ జరగడం మంచిదేనని తెలిపారు. ఇప్పుడైనా గొడవలు సమసిపోతాయని అనుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. డిసిప్లినరీ కమిటీ అనేది కచ్చితంగా ఉంటుందని.. ఇంతకు ముందు కూడా అది పనిచేసిందని తమ్మారెడ్డి పేర్కొన్నారు. ఈ కమిటీ గురించి బహుశా మురళీ మోహన్‌కు తెలియకపోవచ్చని ఆయన చురకలంటించారు. గొడవ ఎవరు చేశారన్నది ముఖ్యం కాదని.. కాని పరిష్కారం […]

ఆధిపత్య పోరు వల్లే మా అసోషియేషన్‌లో గొడవలు జరుగుతున్నాయని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. మా రభసపై స్పందించిన తమ్మారెడ్డి.. పెద్దల ముందు గొడవ జరగడం మంచిదేనని తెలిపారు. ఇప్పుడైనా గొడవలు సమసిపోతాయని అనుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. డిసిప్లినరీ కమిటీ అనేది కచ్చితంగా ఉంటుందని.. ఇంతకు ముందు కూడా అది పనిచేసిందని తమ్మారెడ్డి పేర్కొన్నారు. ఈ కమిటీ గురించి బహుశా మురళీ మోహన్‌కు తెలియకపోవచ్చని ఆయన చురకలంటించారు. గొడవ ఎవరు చేశారన్నది ముఖ్యం కాదని.. కాని పరిష్కారం ఏంటో ఆలోచించాలని తమ్మారెడ్డి పేర్కొన్నారు. చిరంజీవి ముందుండి తమను నడిపించాలని ఆయన కోరారు. ఇక ఇలాంటి గొడవలు.. భవిష్యత్‌లో మా అభివృద్ధికి అడ్డుపడతాయని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే మాలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. మా డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి.. మాట్లాడే సమయంలో రాజశేఖర్ పలుమార్లు కల్పించుకున్నారు. ఒకానొక సమయంలో చిరు దగ్గర నుంచి మైక్ లాక్కొనే ప్రయత్నం కూడా చేశారు. దీంతో చిరంజీవి కాస్త అసహనానికి గురయ్యారు. మరోవైపు రాజశేఖర్ చర్యను పలువురు ఖండించారు.



