మరికాసేపట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..
Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 11 జిల్లాల్లో 21 కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తుతో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈ నెల 8వ తేదీన హస్తినలోని 70 స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పాటుగా బీజేపీ, కాంగ్రెస్‌లు బరిలోకి దిగాయి. ఇక పోలింగ్ ముగిసిన అనంతరం పలు ఎగ్జిట్ పోల్స్ విడుదల కాగా.. అందులో కేజ్రీవాల్ నేతృత్వం […]
Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 11 జిల్లాల్లో 21 కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తుతో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈ నెల 8వ తేదీన హస్తినలోని 70 స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పాటుగా బీజేపీ, కాంగ్రెస్‌లు బరిలోకి దిగాయి. ఇక పోలింగ్ ముగిసిన అనంతరం పలు ఎగ్జిట్ పోల్స్ విడుదల కాగా.. అందులో కేజ్రీవాల్ నేతృత్వం వహిస్తున్న ఆప్ మరోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోనుందని అంచనా వేశాయి.
అయితే బీజేపీ మాత్రం తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాసి పెట్టుకోండి గెలుపు తమదే.. ఆ తర్వాత ఈవీఎంలను నిందించకండి అని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి వ్యాఖ్యానించిన విషయం విదితమే. కాగా, ఉదయం 11 గంటలకు ఢిల్లీకి బాద్షా ఎవరు అవుతారన్న దానిపై స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.