ఓవైపు కరోనా విలయతాండవం.. మరోవైపు గ్రామాల్లో దాహం..దాహం..!

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో వేసవి కూడా వచ్చేసింది.. జనం తాగునీటి కోసం తహతహలాడుతున్నారు. ఓ వైపు కరోనా కోరలు చాచడం..

ఓవైపు కరోనా విలయతాండవం.. మరోవైపు గ్రామాల్లో దాహం..దాహం..!
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 4:48 PM

Water crisis: కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో వేసవి కూడా వచ్చేసింది.. జనం తాగునీటి కోసం తహతహలాడుతున్నారు. ఓ వైపు కరోనా కోరలు చాచడం.. మరోవైపు గడప దాటి వెళ్లాలంటే పోలీసుల ఆంక్షలు ఉండటంతో.. జనం నీటి కోసం అల్లాడుతున్నారు. కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నాయి. దీనికి తోడు తాగునీటి సమస్య కూడా అధికంగా ఉంది.

జిల్లాలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, డోన్, ఆత్మకూరు, గూడూరు, బేతంచర్ల మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ఉన్నాయి. పట్టణాలతో పాటు పల్లెల్లోనూ తాగునీటి సమస్య అధికంగా ఉంది. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడాలని సీఎం జగన్.. ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా సమస్య ఉంటే ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్లతో సరఫరా చేయాలి లేదంటే అగ్రికల్చర్ మోటార్లను అద్దెకు తీసుకొని సరఫరా చేయాలని ఆదేశాలిచ్చారు.

అయినా అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంది. జిల్లా మొత్తం మీద 15 గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. వ్యవసాయ మోటార్లను అద్దెకు తీసుకుని సరఫరా చేస్తున్నామని గ్రామీణ నీటి సరఫరా సూపరింటెండెంట్ ఇంజనీర్ చెప్తున్నారు. అదే సమయంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని వివరిస్తున్నారు. ఎమ్మిగనూర్ లోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. తుంగభద్ర, సుంకేసుల, గాజులదిన్నె, శ్రీశైలం, హంద్రీనీవా ప్రాజెక్టుల నుంచి నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ చాలా చోట్ల పైప్ లైన్ పనిచేయడం లేదు.