కేంద్రం గుడ్ న్యూస్..క్యాష్ విత్ డ్రా చార్జీలు, మినిమ‌మ్ బ్యాలెన్స్ చార్జీలు ర‌ద్దు

క‌రోనా వైర‌స్ తో దేశ‌మంత‌టా అల్ల‌క‌ల్లోలం క్రియేట్ చేస్తోన్న‌ వేళ కేంద్రం ప్ర‌భుత్వం బ్యాంక్ క‌స్ట‌మ‌ర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని చాలా రంగాలు వైర‌స్ తో తీవ్ర ఒడిదొడుగులు ఎదుర్కొంటోన్న వేళ‌, ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతార‌మ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏటీఎం క్యాష్ విత్ డ్రా చార్జీల‌ను 3 నెల‌ల‌పాటు తొలగిస్తున్న‌ట్టు వెల్లడించారు. అంటే జూన్ 30 వ‌ర‌కు ఏ బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేసుకున్నా ఎటువంటి చార్జీలు ఉండ‌వ‌న్న‌మాట‌. అంతేకాదు […]

కేంద్రం గుడ్ న్యూస్..క్యాష్ విత్ డ్రా చార్జీలు, మినిమ‌మ్ బ్యాలెన్స్ చార్జీలు ర‌ద్దు
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 24, 2020 | 5:29 PM

క‌రోనా వైర‌స్ తో దేశ‌మంత‌టా అల్ల‌క‌ల్లోలం క్రియేట్ చేస్తోన్న‌ వేళ కేంద్రం ప్ర‌భుత్వం బ్యాంక్ క‌స్ట‌మ‌ర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని చాలా రంగాలు వైర‌స్ తో తీవ్ర ఒడిదొడుగులు ఎదుర్కొంటోన్న వేళ‌, ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతార‌మ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఏటీఎం క్యాష్ విత్ డ్రా చార్జీల‌ను 3 నెల‌ల‌పాటు తొలగిస్తున్న‌ట్టు వెల్లడించారు. అంటే జూన్ 30 వ‌ర‌కు ఏ బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేసుకున్నా ఎటువంటి చార్జీలు ఉండ‌వ‌న్న‌మాట‌. అంతేకాదు మినిమ‌మ్ బ్యాలెన్స్ లేక‌పోతే వేసే చార్జీలు కూడా తొలగించారు. మ‌రోవైపు పాన్ కార్డును ఆధార్ కు లింక్ చేసే గ‌డువును కూడా జూన్ 30 వ‌ర‌కు పొడిగించారు.