దేశ ఆర్థిక రాజధాని, ఒకప్పటి అండర్ వరల్డ్ డెన్.. మరిప్పుడు…! అనుమానాస్పద మరణాలకు కేరాఫ్ అడ్రెస్.!
సలాం ముంబై....భారత ఆర్ధిక రాజధాని.. ఓ రకంగా మినీ ఇండియా.... ఇది కాయిన్‌కు ఒకవైపు మాత్రమే రెండో వైపు చూస్తే.. ఒకప్పుడు ముంబై అలా అండర్ వాల్డ్..
సలాం ముంబై….భారత ఆర్ధిక రాజధాని.. ఓ రకంగా మినీ ఇండియా…. ఇది కాయిన్‌కు ఒకవైపు మాత్రమే రెండో వైపు చూస్తే.. ఒకప్పుడు ముంబై అలా అండర్ వరల్డ్ డెన్. మరిప్పుడు…! అనుమానాస్పద మరణాలకు..ఆత్మహత్యలకు కేరాఫ్ ? ఆమధ్య సుశాంత్.. రీసెంట్‌గా సందీప్.. ఆ ఇద్దరి అర్ధాంతర మరణాలు అన్‌టోల్డ్ మిస్టరీల్లానే మిగిలాయి. ఇంతలోనే ఎంపీ మోహన్ దేల్కర్ అనుమానాస్పద మృతితో కలకలం.
మోహన్ సంజిభాయ్ దేల్కర్. దాద్రా నగరి హవేలి నుంచి ఏడుసార్లు, లోక్‌సభకు ఎంపికైన నేత. సిల్వసాలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా తన ముద్ర చాటుకున్న ఆయన.. బలమైన ట్రేబల్ నేత ఎదిగారు. 27 ఏళ్ల వయసులోనే 1989లో తొలిసారి ఎంపీగా గెలిచారు. దాద్రానగర్ హవేలి కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. గత లోక్‌సభ ఎన్నికల టైమ్‌లో కాంగ్రెస్‌ను వీడి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనకు దాద్రా నగరి హవేలి బ్రహ్మరథం పట్టింది.
9వ సారి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టిన మోహన్ దేల్కర్ కార్మిక సమస్యలపై గొంతెత్తారు. నియోజవర్గ అభివృద్దే ధ్యేయంగా సభలో బయట తన విజన్ ఏంటో స్పష్టం చేసేవారాయన. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సిల్వాసలో ఆయన చేసిన ప్రసంగం సూపర్ సే ఊపర్. ఆయన మన్ కీ బాత్ ఎప్పడూ కార్మికుల సంక్షేమమే. కార్మికుల ఉపాధి, ఉద్యోగుల భద్రత కోసం అమిత్ షా సమక్షంలో దాద్రానగరి హవేలి ఆవాజ్ విన్పించారు మోహన్ దేల్కర్. ఆయన సేవా నిరతను గమనించిన మోదీ సర్కార్.. మోహన్ దేల్కర్‌కు పర్సనల్ , పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్, హోమ్ మినిస్ట్రీ కన్సల్టేటివ్ కమిటీల్లో సముచిత స్థానం కల్పించింది.
గత డిసెంబర్ 19న మోహన్ దేల్కర్ బర్త్ డే సందర్భంగా ప్రధాని మోది ఆయనకు స్వయంగా అభినందనలు కూడా తెలిపారు. కార్మిక నేతగా.. తిరుగులేని పొలిటిషియన్‌గా ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకున్నారు మోహన్ దేల్కర్. అంతా సాఫీగా సాగిపోతున్న టైమ్‌లో ఆయన అర్ధాంతర మరణం అందర్నీ కలిచివేసింది. ఆత్మహత్యా? మరేదైనా కోణం వుందా? అనుమానాలు వెల్లువెత్తాయి. సౌత్ ముంబైలోని హోటల్‌లోనే మోహన్ దేల్కర్ చివరి మజిలీ. డ్రైవర్, బాడీగార్డ్స్ తో హోటల్‌కు వచ్చారాయన. ఐదో అంతస్తులోని ఓ రూమ్‌లో దిగారు. తెల్లారి చూస్తే అలికిడి లేదు. పక్క రూమ్‌లో వున్న డ్రైవర్..వెంటనే హోటల్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. డోర్ బ్రేక్ చేసి చూస్తే మోహన్ దేల్కర్ శవమై కన్పించారు. వెంటనే డెడ్‌బాడీని హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. స్పాట్‌లో 15 పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నారు.
ఆ లేఖలో ఏముంది? ఆయనది ఆత్మహత్యేనా? అదీ నిజమై వుంటే అందుకు దారి తీసిన కారణాలేంటి? కారకులెవరు?.. నోట్‌లో కీలక అంశాలున్నట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలా? పొలిటికల్ ప్రెషర్సా? నిజానిజాలు పోలీసుల విచారణలో తేలాలిక . మోహన్ దల్కేర్ భార్య కలేబన్ .. ఇద్దరు కుమారులున్నారు. సామాన్య స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగిన మోహన్ దేల్కర్ అర్ధాంతరమణం అభిమానుల్ని కలిచి వేసింది. ఆత్మహత్య అని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. కానీ అభిమానుల్లో మాత్రం అనేక అనుమానాలు కలుగుతున్నాయి.15 పేజీల లేఖలో ఎవరెవరి పేర్లున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇక మోహన్ దల్కేర్ విషాదంతంతో ప్రముఖల ఆత్మహత్యలు..అనుమానాస్పద మరణాలపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
టీడీపీలో కీలక నేతగా నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్‌గా..తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కోడెల శివప్రసాద్‌ది స్పెషల్ చాప్టర్. ఉమ్మడి రాష్ర్టంలో మంత్రిగా ఆయన పొలిటికల్ గ్రాఫ్ అందరికీ తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల క్రమంలో కోడెల అనుమానాస్పత మరణం సంచలనం రేపింది. ఆత్మహత్యలు తప్పని..ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలని సందేశమిచ్చిన ఆయనే..సూసైడ్ చేసుకోవడం..అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. రాజకీయ వేధింపులే కారణమనే ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.
అటు కర్నాటక శాసన మండి డిప్యూటీ చైర్మన్ ధర్మెగౌడ అనుమానాస్పద మరణం కూడా అప్పట్లో వివాదాలకు కేంద్రబిందువైంది. రైలు పట్టాలపై ఆయన శవమై కన్పించడంతో అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. కౌన్సెల్ గొడవలే ధర్మెగౌడ మృతికి కారణమనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. చివరాఖరకు ఆత్మహత్యేని తేల్చారు కన్నడ పోలీసులు. ఎందర్నో ప్రభావితం చేయగల ప్రముఖులు సైతం ఆత్మహత్యలే శరణ్యం అనుకోవడానికి కారణం..ఒత్తిళ్లేనా? కేసుల విచారణ ఎలా వున్నా నేతల అర్ధాంతర మరణాలపై అభిమానుల్లో ఇప్పటికీ ఎన్నెన్నో అనుమానాలు. కోడెల.. ధర్మెగౌడ తాజాగా మోహన్ దేల్కర్ ఈ ముగ్గురి మరణాల వెనుక కన్పించని కోణాలున్నాయా అనేవి ఎప్పటికీ తెగని అనుమానాలు.