Dairy Farmers : చలిపులి పంజా..పాడి రైతు విలవిల..ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోలు
తీవ్రమైన చలి పాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. ఈ 15 రోజుల నుంచి పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. చలి కారణంగా ఆవులు, గేదెలు సరిగా మేత తినడం లేదు.

తీవ్రమైన చలి పాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. ఈ 15 రోజుల నుంచి పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. చలి కారణంగా ఆవులు, గేదెలు సరిగా మేత తినడం లేదు. చలికి పాలు ఇవ్వలేకపోతున్నాయి. ఓ గేదెకు 30 శాతం వరకు పాల ఉత్పత్తి తగ్గిందని, దాణా ఖర్చులు కూడా రావడం లేదని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే చలి కారణంగా ఉదయం 9 గంటలు దాటినా, జనాలు బయటకు రావడం లేదు. చలి ప్రభావం జనాలకే కాదు, మూగజీవాలపై కూడా పడింది. ముఖ్యంగా ఆవులు, గేదెలు చలికి వణికిపోతున్నాయి. చలి కారణంగా అనారోగ్యానికి గురవుతున్నాయి. పాలు కూడా సరిగా ఇవ్వటం లేదంటున్నారు రైతులు.
ఇప్పటికే పాల ధర సరిగా లేదు. దీనికి తోడు ఇప్పుడు తక్కువ పాలు ఇవ్వడంతో తాము మరింత నష్టపోతామని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం దాణా ఖర్చు కూడా రావడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పాడి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Also Read :
మెడిసిన్ ఇచ్చి ఆదుకున‌్న భారతం..మన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఆరాటం