ప్రముఖ నృత్యకారుడు సునీల్ కొఠారీ కన్నుమూత.. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన కొఠారీ
పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ నృత్యకారుడు సునీల్ కొఠారీ కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏళ్లు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ నృత్యకారుడు సునీల్ కొఠారీ కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏళ్లు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. గతనెల సునీల్ కొఠారీ కరోనా వైరస్ బారిన పడ్డారు. గుండెపోటు రావడంతో ఆయనను ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్సను అందిస్తుండగా సునీల్ కొఠారీ కన్నుమూశారు. సుమారు 20కి పైగా పుస్తకాలు రాశారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్ నృత్యాలపై ఆయన పుస్తకాలు రచించారు. 1933 డిసెంబర్ 20న జన్మించిన ఆయన భారతీయ నృత్య కళలకు వన్నెతెచ్చారు. సునీల్ కొఠారీ మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేస్తున్నారు. 2001 లో ఆయనకు పద్మశ్రీ అవార్డు దక్కింది. 1995 లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు వరించింది.




