AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పై కేసు నమోదు.. అసలు కారణం ఇదే..

బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ , దర్శకుడు సంజయ్ లీల బన్సాలి పైన కేసు నమోదు అయ్యింది.  ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పై కేసు నమోదు.. అసలు కారణం ఇదే..
Rajeev Rayala
|

Updated on: Dec 27, 2020 | 8:35 PM

Share

బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పైన కేసు నమోదు అయ్యింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దాంతో ఈ ఇద్దరికీ కోర్టు షోకాజ్ నోటీసులు జరీ చేసింది. అసలు విషయం ఏంటంటే.. సంజయ్ లీలా బన్సాలీ ‘గంగూబాయ్ కతియావాడి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ముంబై మాఫియా క్వీన్ ‘గంగూబాయి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఈ సినిమా పై గంగూబాయి కుమారుడు బాబూజీ రాజీ షా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కారు. హీరోయిన్, దర్శకుడితో పాటు ‘ద మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకాన్ని రాసిన హుస్సేన్ జైదీ పై ఈ సినిమాకు సహకరించిన రిపోర్టర్ జేన్ బోర్గ్స్ పై బాంబే సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశారు రాజీ షా. ఈ పుస్తక ప్రచురణలను నిలిపివేయడంతో పాటు దీని ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాను కూడా ఆపేయాలని ఆయన కోరారు. సినిమాలో గుంగూబాయిని అసభ్యంగా చిత్రీకరించినందుకు పరువు నష్టం దావా వేసేందుకు కూడా వెనకాడబోమని బాబూజీ రాజీ షా న్యాయవాది పేర్కొన్నారు. ఈ విషయం పై స్పందించాలని కోర్టు చిత్ర యూనిట్ కు సమన్లు పంపుతూ జనవరి 7 వరకు గడువునిచ్చింది. మరి ఈ వ్యవహారం పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. సూపర్ స్కీమ్ ప్రకటించిన సీఎం
విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. సూపర్ స్కీమ్ ప్రకటించిన సీఎం
ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..