దేవూ మోటార్స్‌ ఆస్తుల వేలం..!

ముంబయి: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం భారతీయ విభాగమైన దేవూ మోటార్స్‌ ఇండియా ఆస్తులు వచ్చే నెల వేలానికి రానున్నాయి. దేవూ మోటార్స్‌ ఇండియాను 2008లో పాన్‌ ఇండియా మోటార్స్‌ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ సంస్థ కూడా రుణ ఊబిలో చిక్కుకు పోయింది. దీంతో డెట్‌ రికవరీ ట్రైబ్యునల్‌ ఏప్రిల్‌ 11న దేవూ ఇండియా ఆస్తులను వేలం వేయనుంది. దాదాపు రూ.2,250 కోట్ల బకాయిల వసూలుకు ఈ వేలం జరగనుంది. కంపెనీ మూతపడిన దాదాపు 15ఏళ్ల […]

దేవూ మోటార్స్‌ ఆస్తుల వేలం..!
Follow us

|

Updated on: Mar 10, 2019 | 12:42 PM

ముంబయి: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం భారతీయ విభాగమైన దేవూ మోటార్స్‌ ఇండియా ఆస్తులు వచ్చే నెల వేలానికి రానున్నాయి. దేవూ మోటార్స్‌ ఇండియాను 2008లో పాన్‌ ఇండియా మోటార్స్‌ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ సంస్థ కూడా రుణ ఊబిలో చిక్కుకు పోయింది. దీంతో డెట్‌ రికవరీ ట్రైబ్యునల్‌ ఏప్రిల్‌ 11న దేవూ ఇండియా ఆస్తులను వేలం వేయనుంది. దాదాపు రూ.2,250 కోట్ల బకాయిల వసూలుకు ఈ వేలం జరగనుంది. కంపెనీ మూతపడిన దాదాపు 15ఏళ్ల తర్వాత ఇటీవల డీఆర్‌టీ నోటీసులు జారీ చేసింది.రెండు విడతలుగా ఆన్‌లైన్‌ వేలం నిర్వహించనుంది. వీటిల్లో గ్రేటర్‌ నోయిడాలో రూ.204 కోట్లు విలువ చేసే భూమి కూడా ఉంది. ఈ వేలంలో పాల్గొనడానికి కనీస రిజర్వు ధర రూ.528.61 కోట్లుగా నిర్ణయించారు. ఈ వేలంలో విజయం సాధించినవారు యూపీ స్టేట్‌ ఇండస్ట్రీయల్‌ కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన రూ.66.58 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఏడుగురు రుణదాతలకు సంబంధించిన రుణాల వసూలుకు దీనిని నిర్వహిస్తున్నారు. ఈ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, ఎస్‌బీఐ, బీవోఐలు ఉన్నాయి.