బెంగాల్‌లో స్కూళ్లకు సెలవు…పలు రైళ్లు, విమానాలు రద్దు

తూర్పు తీరంలో ‘ఫొని’ పెను తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఒడిశాను అతలాకుతలం చేస్తున్న ‘ఫొని’ తుఫాన్ బెంగాల్‌లోనూ ప్రకంపనలు రేపుతోంది. ప్రచండ తుఫాన్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోల్‌కతా సహా పలు జిల్లాలకు హెచ్చరికలు జారీచేసింది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు.  తుఫాన్ ఒడిశా దాటిన తర్వాత బెంగాల్‌పై ప్రభావం చూపిస్తుందన్న అంచనాలతో అధికార యంత్రాంగాన్ని సీఎం మమతా బెనర్జీ అలర్ట్ చేశారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. తీర ప్రాంతాలకు […]

బెంగాల్‌లో స్కూళ్లకు సెలవు...పలు రైళ్లు, విమానాలు రద్దు
Follow us

|

Updated on: May 03, 2019 | 12:04 PM

తూర్పు తీరంలో ‘ఫొని’ పెను తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఒడిశాను అతలాకుతలం చేస్తున్న ‘ఫొని’ తుఫాన్ బెంగాల్‌లోనూ ప్రకంపనలు రేపుతోంది. ప్రచండ తుఫాన్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోల్‌కతా సహా పలు జిల్లాలకు హెచ్చరికలు జారీచేసింది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు.  తుఫాన్ ఒడిశా దాటిన తర్వాత బెంగాల్‌పై ప్రభావం చూపిస్తుందన్న అంచనాలతో అధికార యంత్రాంగాన్ని సీఎం మమతా బెనర్జీ అలర్ట్ చేశారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. తీర ప్రాంతాలకు వెళ్లకూడదని పర్యాటకులకు విజ్ఞప్తిచేశారు.

ధిఘా, శంకర్‌పూర్, తాజ్‌పూర్, బక్కలి ప్రాంతాల్లోని ప్రజలు మట్టి ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.  ఫోని తుఫాన్ తీరం దాటే వరకు మత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. తుఫాన్ ప్రభావ పరిస్థితిని సమీక్షించేందుకు రెండ్రోజులు పాటు ఖరగ్‌పూర్‌లోనే ఉండనున్నారు సీఎం మమతా బెనర్జీ. అటు రైల్వే శాఖ సైతం అప్రమత్తమైంది. ఇప్పటికే 6 రైళ్లను రద్దుచేసిన ఆగ్నేయ రైల్వే శాఖ..మరికొన్నింటిని దారి మళ్లిస్తోంది. కోల్‌కతా ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. టూరిస్టు బోటు ప్రయాణాలను సైతం అధికారులు రద్దుచేశారు. ఎప్పటికప్పుడు అధికారులతో సిఎం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి