కృష్ణాజిల్లాలో ముగ్గురిపై కత్తితో దాడిచేసిన సి.ఆర్.పి.ఎఫ్ ASI

కృష్ణాజిల్లా పామర్రు మండలం చెన్నువానిపురంలో ముగ్గురు వ్యక్తులపై సి.ఆర్.పి.ఎఫ్ లో ASI గా పనిచేస్తున్న చంద్రశేఖర్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఫలితంగా బొడ్డు బాబూరావు(65), దోనే అప్పలస్వామి(63), తుమ్మల శ్రీరాములు(63) కత్తి గాట్లకు గురయ్యారు. బాధితులను గ్రామస్తులు హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కత్తి దాడికి గురైన బాధితులకు న్యాయం చేయాలంటూ కొందరు గ్రామస్తులు మచిలీపట్నం-విజయవాడ హైవే పై చెన్నువానిపురం వద్ద ధర్నా నిర్వహించారు. ఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. చంద్రశేఖర్ తో […]

కృష్ణాజిల్లాలో ముగ్గురిపై కత్తితో దాడిచేసిన సి.ఆర్.పి.ఎఫ్ ASI
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 05, 2020 | 1:22 PM

కృష్ణాజిల్లా పామర్రు మండలం చెన్నువానిపురంలో ముగ్గురు వ్యక్తులపై సి.ఆర్.పి.ఎఫ్ లో ASI గా పనిచేస్తున్న చంద్రశేఖర్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఫలితంగా బొడ్డు బాబూరావు(65), దోనే అప్పలస్వామి(63), తుమ్మల శ్రీరాములు(63) కత్తి గాట్లకు గురయ్యారు. బాధితులను గ్రామస్తులు హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కత్తి దాడికి గురైన బాధితులకు న్యాయం చేయాలంటూ కొందరు గ్రామస్తులు మచిలీపట్నం-విజయవాడ హైవే పై చెన్నువానిపురం వద్ద ధర్నా నిర్వహించారు. ఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. చంద్రశేఖర్ తో పాటు అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

అయితే, కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తీసుకువెళ్లడాన్ని చంద్రశేఖర్ బంధువులు అడ్డుకున్నారు. ఇలాఉండగా, ఎఎస్ఐ చంద్రశేఖర్‌కు.. గ్రామస్తులకు మధ్య గత కొంత కాలంగా గ్రామకంఠ భూమిపై గొడవలు జరుగుతున్నాయి. ఈరోజు చంద్రశేఖర్ ఇంటి పని నిమిత్తమై సదరు భూమిలో కంకరు చేర వేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. ఆ స్థలం విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం రేగడంతో తీవ్ర ఉద్రేకానికి లోనైన చంద్రశేఖర్ కత్తితో ముగ్గురిపై దాడి చేశాడు.