Crime news: కొడుకు కాలేజీ ఎగ్గొట్టాడని.. తల్లి ఆత్మహత్య..!
కేవీబీపురం మండలంలోని ఆరె పంచాయతీ కున్నంకళత్తూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు కళాశాలకు వెళ్లలేదని మూడు రోజుల కిందట తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Crime news: కేవీబీపురం మండలంలోని ఆరె పంచాయతీ కున్నంకళత్తూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు కళాశాలకు వెళ్లలేదని మూడు రోజుల కిందట తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోహన్, జ్యోతిల దంపతులకు ఇద్దరు సంతానం. మొదటి కుమారుడు శ్రీకాళహస్తిలోని ఓప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకుంటున్నాడు. కొడుకు సక్రమంగా కళాశాలకు వెళ్లడంలేదని ఈనెల 25న కొడుకును తల్లి మందలించింది.
కాగా.. ఏమాత్రం లెక్కచేయని కొడుకును ఎలాగైనా కళాశాలకు పంపించే ప్రయత్నంలో భాగంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో స్థానికులు ఆమెను నాగలాపురం, నగరి, తిరుపతిలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. చివరకు ఈనెల 26న మధ్యాహ్నం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు సాయంత్రం మృతి చెందింది. సంఘటనపై మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు గురువారం కేవీబీపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.