విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ పాగా, ఆటకట్టించిన పోలీసులు

విజయవాడలో ఆన్​లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొగల్రాజపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తోంది.

విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ పాగా, ఆటకట్టించిన పోలీసులు
Follow us

|

Updated on: Sep 20, 2020 | 6:29 PM

విజయవాడలో ఆన్​లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొగల్రాజపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తోంది. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారంతా తూర్పుగోదావరి జిల్లా వాసులుగా గుర్తించారు.

‘అవతార్’ అనే యాప్ ద్వారా ఈ గ్యాంగ్ ఆన్​లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు. బెట్టింగ్ కోసం వినియోగించిన లైన్ బాక్స్, 25 సెల్​ఫోన్స్, ఎల్​సీడీ మానిటర్, లాప్​టాప్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ప్రధాన సూత్రధారి నవీన్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. రూ.12 లక్షల వరకు బెట్టింగ్ జరిగిందని పోలీస్ వర్గాల సమాచారం. కాగా బెట్టింగ్‌పై ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలు సహకరించాలని డీసీపీ హర్షవర్ధన్ కోరారు.

Also Read :

ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం.. ఈ రూల్స్ తప్పనిసరి

వానలే వానలు : మరో అల్పపీడనం, ఏపీకి భారీ వర్ష సూచన

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం : ముగ్గురు యువకులు దుర్మరణం