ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం.. ఈ రూల్స్ తప్పనిసరి

ఏపీలో కరోనా ప్రభావంతో మూతపడిన విద్యా సంస్థలు ఎట్టకేలకు ఏడు నెలల తర్వాత తెరుచుకోనున్నాయి. స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేయడంతో...

ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం.. ఈ రూల్స్ తప్పనిసరి
Follow us

|

Updated on: Sep 20, 2020 | 4:48 PM

ఏపీలో కరోనా ప్రభావంతో మూతపడిన విద్యా సంస్థలు ఎట్టకేలకు ఏడు నెలల తర్వాత తెరుచుకోనున్నాయి. స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేయడంతో, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలు తెరిచేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతుంది. కంటైన్మెంట్ జోన్లకు బయట ఉన్న విద్యా సంస్థలు మాత్రమే తెరవనున్నారు. ఫస్ట్ డే టీచర్లందరూ విధులకు హాజరుకావాల్సి ఉంటుంది.  సెప్టెంబరు 22 నుంచి ఆన్‌లైన్‌ టీచింగ్, టెలీ కౌన్సెలింగ్‌, విద్యా వారధి తదితర కార్యక్రమాల కోసం సగం మంది టీచర్స్ విధులకు హాజరవుతారు. 9 నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులు పేరెంట్స్ అనుమతితో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లొచ్చు. అయితే, ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు ప్రవేశం లేదు.

కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యార్థులకు వాట్సప్‌ గ్రూపు ద్వారా ఆన్‌లైన్‌లో మార్గనిర్దేశం చేస్తారు. వీరు అవసరమైతే దగ్గర్లోని  ఉన్నత పాఠశాలకు వెళ్లి, డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. విద్యావారధి, విద్యామృతం వంటి కార్యక్రమాలు అక్టోబరు 5వరకు కొనసాగుతాయి. ఒకటి నుంచి 8 తరగతుల విద్యార్థులకు పేరెంట్స్ ద్వారానే మార్గదర్శనం చేయాల్సి ఉంటుంది. వీరికి ఆన్‌లైన్‌, వీడియో పాఠాలే కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించి వర్క్‌షీట్లను అభ్యాస యాప్‌లో అందుబాటులో ఉంచారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని అభ్యాసనం కొనసాగించేలా టీచర్స్ సూచనలు చేయాలి.

తొమ్మిది, ఆపై తరగతుల విద్యార్థులను మాత్రమే డౌట్స్ క్లారిఫై చేసుకునేందుకు విద్యా సంస్థలకు వచ్చేందుకు అనుమతించాలి. ఇందుకు తల్లిదండ్రుల పర్మిషన్ తప్పనిసరి. స్టూడెంట్స్ మధ్య ఆరు అడుగుల దూరం తప్పక పాటించాలి. నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, వాటర్ బాటిళ్లను పరస్పరం మార్చుకోకుండా చూడాలి.

ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ స్కూల్స్ లో ఆన్‌లైన్‌ టీచింగ్, విద్యా వారధి కార్యక్రమం కోసం రోజుకు 22-50 శాతం టీచర్స్ హాజరు కావాలి.  మాస్కులు తప్పనిసరి. చేతులను తరుచూ సబ్బుతో కడుక్కోవాలి. శానిటైజర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. స్కూల్ ప్రాంగణంలో ఉమ్మివేయడం నిషేధం. ప్రధానోపాధ్యాయులు.. పంచాయతీరాజ్‌, పురపాలక విభాగాలను సంప్రదించి  స్కూల్ పరిసరాలను శానిటైజ్‌ చేయించాలి.

Also Read : రాజ్యసభ సభ్యుడిగా మాజీ ప్రధాని దేవెగౌడ