చంద్రబాబుపై కోపంతోనే జగన్ రాజధానిని విచ్ఛిన్నం చేశారు!

సీపీఐ నేత నారాయణ సీఎం జగన్, చంద్రబాబుపై కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై కోపంతోనే జగన్ రాజధానిని విచ్ఛిన్నం చేస్తున్నారని.. వారి రాజకీయ కోపాలకు ప్రజలు బలవుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతీసారి విధానాలు మార్చడం సరికాదన్నారు. మీ కక్షలు రాష్ట్ర ప్రజలపై చూపొద్దని.. హైకోర్టుతో రాయలసీమ అభివృద్ధి చెందదన్నారు. కాగా.. జీఎన్ రావు కమిటీ విలువలేనిదని.. సీఎం జగన్ చెప్పిన నివేదికనే కమిటీ రాసి ఇచ్చిందని నారాయణ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ, సచివాలయం […]

చంద్రబాబుపై కోపంతోనే జగన్ రాజధానిని విచ్ఛిన్నం చేశారు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 21, 2019 | 3:06 PM

సీపీఐ నేత నారాయణ సీఎం జగన్, చంద్రబాబుపై కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై కోపంతోనే జగన్ రాజధానిని విచ్ఛిన్నం చేస్తున్నారని.. వారి రాజకీయ కోపాలకు ప్రజలు బలవుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతీసారి విధానాలు మార్చడం సరికాదన్నారు. మీ కక్షలు రాష్ట్ర ప్రజలపై చూపొద్దని.. హైకోర్టుతో రాయలసీమ అభివృద్ధి చెందదన్నారు. కాగా.. జీఎన్ రావు కమిటీ విలువలేనిదని.. సీఎం జగన్ చెప్పిన నివేదికనే కమిటీ రాసి ఇచ్చిందని నారాయణ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ, సచివాలయం ఒకే చోట ఉండాలి. వేర్వేరు చోట్లో పరిపాలన సాధ్యం కాదు. చంద్రబాబు చేసింది తక్కువ.. ప్రచారం ఎక్కువని.. బాబుపై కోపంతోనే జగన్ రాజధానిని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కోపాలకు ప్రజలు బలవుతున్నారు. చంద్రబాబు, జగన్ బరిలోకి దిగి కొట్టుకుంటే నేను రిఫరీ గా ఉంటానని నారాయణ ఘాటుగా విమర్శలు చేశారు.