ఏపీలో ఇక నుంచి 13 జిల్లాలు కాదు.. 25 జిల్లాలు!
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏపీని 25 జిల్లాలుగా చేస్తామని పేర్కొన్నారు. దానికి తగ్గట్టుగానే అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. అధికారం కోసం ఆశపడకుండా ప్రజలకు సేవ చేయడానికి ఉన్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అంటూ చెప్పకొచ్చారు. విశాఖ పట్టణాన్ని ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌గా చేస్తూ.. జగన్ ఇచ్చినటువంటి ప్రకటన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అధికార కేంద్రీకరణ ఒక ప్రాంతంలో కేంద్రీకృతమైతే అది రాష్ట్రానికి మంచిది […]
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏపీని 25 జిల్లాలుగా చేస్తామని పేర్కొన్నారు. దానికి తగ్గట్టుగానే అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. అధికారం కోసం ఆశపడకుండా ప్రజలకు సేవ చేయడానికి ఉన్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అంటూ చెప్పకొచ్చారు.
విశాఖ పట్టణాన్ని ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌గా చేస్తూ.. జగన్ ఇచ్చినటువంటి ప్రకటన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అధికార కేంద్రీకరణ ఒక ప్రాంతంలో కేంద్రీకృతమైతే అది రాష్ట్రానికి మంచిది కాదన్న ఉద్ధేశ్యంతోనే.. జగన్ అధికార వికేంద్రీకరణ చేశారని విజయసాయి తెలిపారు. కాగా.. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను రాబోయే కాలంలో 25 జిల్లాలుగా చేస్తామని చెప్పారు. ఆ 25 జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నారు. అందుకే జగన్ మూడు ప్రాంతాలను రాజధానులుగా మార్చారని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి.
కాగా.. విశాఖలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాసరావు సహా పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గగొన్నారు. ఈ సందర్బంగా.. కేక్ కట్ చేసి, సీఎం వైఎస్ జగన్‌కు బర్త్ డే విషెస్ తెలియజేశారు.