సంక్రాంతికి హడావిడి షురూ.. అడ్డంగా దోచేసుకుంటున్నారు!

సంక్రాంతి పండుగకు ఇప్పటి నుంచే హడావిడి మొదలైపోయింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లి.. పల్లెటూరి రుచులను ఆస్వాదించాలని..

సంక్రాంతికి హడావిడి షురూ.. అడ్డంగా దోచేసుకుంటున్నారు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 05, 2021 | 6:27 PM

సంక్రాంతి పండుగకు ఇప్పటి నుంచే హడావిడి మొదలైపోయింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లి.. పల్లెటూరి రుచులను ఆస్వాదించాలని అనుకుంటున్నారు. దీంతో.. పండుగ రాకముందే పడిగాపులు మొదలయ్యాయి. సంక్రాంతికి ఇంకా 25రోజుల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ట్రావెల్స్ సంస్థల దోపిడీ.. షురూ అయింది. అటు రిజర్వేషన్ల వెయిటింగ్ లిస్టులు పేరుకుపోతున్నాయి. రెండు నెలల ముందే ట్రైన్లలో రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే సిద్ధమవుతోంది.

ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తైనట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. గోదావరి వెయిటింగ్‌ లిస్టు 150కి పైగానే ఉందట. జన్మభూమి 240 వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది. గౌతమి అయితే 700కు పైగానే చూపిస్తోంది. మరికొన్నింటికి వెయిటింగ్ లిస్ట్ ఆప్షనే తీసేశారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. జనవరి మొదటి వారం ఇంకా ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రయాణికుల్లో కనిపిస్తోంది. ఆల్రెడి వెయిటింగ్ లిస్టులో ఉన్నవాళ్లు కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలియక ఆయోమయంలో ఉన్నారు. ఈసారి తమ ఫ్యామిలీ మొత్తం సొంతూరికి వెళ్లడం కష్టమే అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.

ఇక ప్రైవేట్ వాహనాల్లో దోపిడీ మామూలుగా లేదు. ఒక్కో టికెట్ ధర 2వేల పైమాటే. ఇక ఆర్టీసీ స్పెషల్ సర్వీస్‌ పేరుతో ఎక్కువ వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రైల్వే అధికారులే మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ ట్రైన్స్ నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. జనవరి 5 నుంచి 25 వరకు సౌత్ ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అన్ని ప్రాంతాలకు 135 రైళ్లను అదనంగా నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని సీపీఆర్‌వో రాకేష్ తెలిపారు.