జీఎన్‌రావు కమిటీపై రైతుల గుస్సా! నిరసనలు మరింత ఉధృతం
అమరావతిలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. అందులోనూ.. శుక్రవారం జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్‌పై ఈ ఆందోళనలు మరింత ఉధృతం చేశారు రైతులు. అమరావతిలో ఎక్కడ చూసినా ఇవే నిరసనలు కనిపిస్తున్నాయి. మందడం, వెలగపూడి, తుళ్లూరులో నిరసనల సెగలు తగులుతోన్నాయి. రోడ్లపై టైర్లు కాల్చి వాహనాలను అడ్డుకుంటున్నారు రైతులు. కాగా.. తుళ్లూరులో రోడ్లపైనే రైతులు వంటావార్పు చేపట్టాగా.. మందడంలో ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. కాగా రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్‌లో అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. ఇక […]
అమరావతిలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. అందులోనూ.. శుక్రవారం జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్‌పై ఈ ఆందోళనలు మరింత ఉధృతం చేశారు రైతులు. అమరావతిలో ఎక్కడ చూసినా ఇవే నిరసనలు కనిపిస్తున్నాయి. మందడం, వెలగపూడి, తుళ్లూరులో నిరసనల సెగలు తగులుతోన్నాయి. రోడ్లపై టైర్లు కాల్చి వాహనాలను అడ్డుకుంటున్నారు రైతులు. కాగా.. తుళ్లూరులో రోడ్లపైనే రైతులు వంటావార్పు చేపట్టాగా.. మందడంలో ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. కాగా రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్‌లో అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. ఇక వెలగపూడిలో రిలే దీక్షలకు పిలుపునిచ్చారు రైతులు. అలాగే.. పెదపరిమిలో రైతులు ఆందోళనలు మిన్నంటాయి. జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్‌పై రైతులు అమరావతి వ్యాప్తంగా నిరసలను దిగారు. దీంతో.. అన్ని ప్రదేశాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
నిన్న సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు అమరావతి రైతులు. టైర్లు తగులబెట్టి, బారికేడ్లు విసిరేశారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో సచివాలయం దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళనతో ఏపీలో శాంతిభద్రతల కోసం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీస్ ఉన్నతాధికారులు. వెలగపూడిలో ఉన్న సచివాలయం దగ్గర పోలీస్ బలగాలను రంగంలోకి దించారు గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు. అర్థరాత్రి సచివాలయం దగ్గరికి వెళ్లి శాంతిభద్రతల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.