దిశ నిందితుడు చెన్నకేశవుల భార్యకు 13 ఏళ్లేనట!

దిశ హత్యాచార కేసులో ఏ4గా నిందితుడు చెన్నకేశవులు ఉన్నాడు. కాగా.. వారు గతంలో పలు నేరాలకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగాా..  చెన్నకేశవుల భార్య గురించి కొన్ని ఆసక్తిరమైన నిజాలు వెలుగు చూశాయి. ఆ బాలికకు సంబంధించిన వివరాలను పాఠశాల నుంచి అధికారులు సేకరించారు. పాఠశాలలో ఉన్న తేదీ ప్రకారం.. ఆ బాలిక వయసు 13 సంవత్సరాలుగా ఆరు నెలలుగా గుర్తించారు. దీంతో.. ఆమె మైనర్‌ అని తేలింది. అంతేకాకుండా.. ఆమె ప్రస్తుతం 6 నెలల గర్భవతిగా […]

దిశ నిందితుడు చెన్నకేశవుల భార్యకు 13 ఏళ్లేనట!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 21, 2019 | 1:48 PM

దిశ హత్యాచార కేసులో ఏ4గా నిందితుడు చెన్నకేశవులు ఉన్నాడు. కాగా.. వారు గతంలో పలు నేరాలకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగాా..  చెన్నకేశవుల భార్య గురించి కొన్ని ఆసక్తిరమైన నిజాలు వెలుగు చూశాయి. ఆ బాలికకు సంబంధించిన వివరాలను పాఠశాల నుంచి అధికారులు సేకరించారు. పాఠశాలలో ఉన్న తేదీ ప్రకారం.. ఆ బాలిక వయసు 13 సంవత్సరాలుగా ఆరు నెలలుగా గుర్తించారు. దీంతో.. ఆమె మైనర్‌ అని తేలింది. అంతేకాకుండా.. ఆమె ప్రస్తుతం 6 నెలల గర్భవతిగా ఉందని సమాచారం. ఆ బాలికకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె.. బాబాయి, నాన్నమ్మల వద్ద పెరిగింది.

చెన్నకేశవులతో ప్రేమ వివాహం అనంతరం అత్తారింట్లో ఉంటోంది. ఆమెకి ఒక చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. దీంతో.. ఆమెకు 18 సంవత్సరాలు వచ్చేంతవరకూ బాలికల సంరక్షణ విభాగానికి తరలిస్తామని కుటుంబసభ్యులను అధికారులు అడగగా.. దానికి  వారు అంగీకరించలేదు. పోని ఆమె చెల్లెలు, తమ్ముడినైనా పంపించమని కోరారు. అయితే తమ్ముడిని మాత్రమే పంపిస్తామని.. చెల్లెలు తమ వద్దే ఉటుందని చెన్నకేశవులు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.