ఓటు వేసినవారికే అన్ని అవకాాశాలు.. గ్రేటర్‌లో ఓటింగ్ తగ్గడంపై సీరియస్‌గా స్పందించిన సీపీ సజ్జనార్..

గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గడంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటు హక్కు కాదు...ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో అది ఎక్కడా కనిపించలేదన్నారు.

ఓటు వేసినవారికే అన్ని అవకాాశాలు.. గ్రేటర్‌లో ఓటింగ్ తగ్గడంపై సీరియస్‌గా స్పందించిన సీపీ సజ్జనార్..
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 01, 2020 | 6:01 PM

గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గడంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటు హక్కు కాదు…ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో అది ఎక్కడా కనిపించలేదన్నారు. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

దీనిపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కొత్త ఆలోచన చేయాలన్నారు. ఆఖరికి విద్యార్థులకు సీట్లు పొందాలన్నా, సర్టిఫికెట్ తీసుకోవాలన్న కచ్చితంగా ఓటు వేసి ఉండాలన్న నిబంధన పెట్టాలి అని సూచించారు. ఓటు వేసిన వ్యక్తులకే ఉద్యోగ, విద్యావకాశాలు కల్పించాలన్నారు. చివరికి మంచినీటి కనెక్షన్ పొందాలన్నా సరే ఓటు వేసి ఉండాలన్న నిబంధనను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.

ఏదైనా పథకానికి దరఖాస్తు చేయాలంటే లక్షల్లో జనాలు ముందుకు వేస్తారు..అదే  ఓటు వేయాలంటే మాత్రం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఉదయం నుంచి గ్రేటర్ పరిధిలోని అన్ని పోలింగ్ బూత్ ల దగ్గర తిరుగుతున్నాను.. ఎక్కడా.. జనాల క్యూలైన్లు కనిపించలేదని అన్నారు.  ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేలా నిర్ణయం తీసుకుంటేనే ఓటింగ్ శాతం పెరుగుతుందని అన్నారు.

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..