మోడర్నా వ్యాక్సిన్‌ రెడీ..! మొదట వారికేనట… ఏడాది చివరికల్లా 2 కోట్ల డోసులు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం…

గ్లోబల్ ఫార్మా కంపెనీ మోడర్నా ఇంక్ మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ 1273 పేరుతో కరోనా వాక్సిన్ ను తయారు చేస్తోంది. తాజాగా ఆ సంస్థ తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగించేందుకు అనుమతించవలసిందిగా దరఖాస్తు చేసుకుంది.

మోడర్నా వ్యాక్సిన్‌ రెడీ..! మొదట వారికేనట... ఏడాది చివరికల్లా 2 కోట్ల డోసులు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం...
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 01, 2020 | 5:35 PM

Moderna says request us for vaccine authorization గ్లోబల్ ఫార్మా కంపెనీ మోడర్నా ఇంక్ మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ 1273 పేరుతో కరోనా వాక్సిన్ ను తయారు చేస్తోంది. తాజాగా ఆ సంస్థ తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగించేందుకు అనుమతించవలసిందిగా అమెరికన్, యూరోపియన్‌ ఔషధ నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేసుకుంది. కొవిడ్ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారిపై తమ వ్యాక్సిన్‌ 100 శాతం ప్రభావం చూపుతున్నట్లు ఆ సంస్థ తెలియజేసింది. వ్యాక్సిన్‌ తుది దశ క్లినికల్‌ పరీక్షలలో 94.1 శాతం సత్ఫలితాలు వెలువడినట్లు మోడర్నా ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది చివరికల్లా 2 కోట్ల డోసేజీలను అందుబాటులో ఉంచే వీలున్నట్లు మోడర్నా ఇంక్‌ తెలియజేసింది.

డిసెంబర్ 17న సమావేశం…

మోడర్నా ఇంక్‌ వ్యాక్సిన్‌పై సమీక్షను చేపట్టేందుకు యూఎస్‌ఎఫ్‌డీఏకు చెందిన స్వతంత్ర సలహాదారులు ఈ నెల 17న సమావేశం కానున్నారు. తద్వారా వ్యాక్సిన్‌ సంబంధ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్‌ అడ్వయిజరీ కమిటీ(వీఆర్‌బీపీఏసీ)గా పిలిచే సలహాదారులు వ్యాక్సిన్లపై ఎఫ్‌డీఏకు సూచనలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఎమర్జీన్సీ వినియోగం కోసం ఇప్పటికే యూఎస్‌ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసిన ఫైజర్‌ ఇంక్‌ వ్యాక్సిన్‌పై ఈ నెల 10న సమీక్షను నిర్వహించనున్నారు. రెండు కంపెనీల డేటాను మదింపు చేశాక యూఎస్‌ఎఫ్‌డీఏకు వీరు సలహాలు అందించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.