మాయదారి కరోనా.. అప్పుడే పుట్టిన బిడ్డను.. వీడియో కాల్ లో చూసుకున్న తల్లి..
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్ డౌన్‌లో ఉండిపోయింది. కరోనా మహమ్మారి మనుషుల మధ్య పెద్ద గోడలా నిలుస్తోంది. తల్లీబిడ్డలను కూడా దూరం చేస్తోంది. ఇటీవల మహారాష్ట్రలోని

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్ డౌన్‌లో ఉండిపోయింది. కరోనా మహమ్మారి మనుషుల మధ్య పెద్ద గోడలా నిలుస్తోంది. తల్లీబిడ్డలను కూడా దూరం చేస్తోంది. ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. కొన్ని రోజుల క్రితం ఓ గర్భవతి.. ఔరంగాబాద్ ప్రభుత్వాస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు కరోనా సోకి ఉండటంతో ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
కాగా.. పుట్టిన బిడ్డకు కరోనా సోకలేదు. దీంతో బిడ్డను తల్లి నుంచి వేరు చేసి వేరే వార్డులో ఉంచారు. ఈ నేపథ్యంలో తన బిడ్డను ఒక్కసారి చూడాలని ఆ తల్లి కోరింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది వీడియోకాల్ ద్వారా ఆ తల్లికి బిడ్డను చూపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
[svt-event date=”25/04/2020,6:24PM” class=”svt-cd-green” ]
Maharashtra: Staff at Aurangabad Civil Hospital arrange a video call between a #COVID19 positive mother&her newborn baby who have been kept in separate wards. “On April 18, the baby was born by cesarean section&tested negative,” says Aurangabad Civil Surgeon Dr. Sunder Kulkarni. pic.twitter.com/hJmWvqztFe
— ANI (@ANI) April 23, 2020
[/svt-event]



