కరోనా చికిత్స కోసం.. ఆర్టీసీ బస్సులో మొబైల్ క్లినిక్..
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్ డౌన్‌లో ఉండిపోయింది. కొవిడ్-19 రోగులకు చికిత్స అందించేందుకు వీలుగా కర్నాటక ఆర్టీసీ (కేఎస్‌ఆర్టీసీ) ఓ బస్సును క్లినిక్‌లా మార్చింది.

Mobile clinic: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్ డౌన్‌లో ఉండిపోయింది. కొవిడ్-19 రోగులకు చికిత్స అందించేందుకు వీలుగా కర్నాటక ఆర్టీసీ (కేఎస్‌ఆర్టీసీ) ఓ బస్సును క్లినిక్‌లా మార్చింది. మైసూరులో ఏర్పాటు చేసిన ఈ మొబైల్ క్లినిక్‌లో పేషెంట్ కోసం ఓ బెడ్‌తో పాటు డాక్టర్ కోసం ప్రత్యేక క్యాబిన్ కూడా ఉంది.
మరోవైపు.. వీటితో పాటు సీటింగ్ సదుపాయం, మెడిసిన్ బాక్సు, వాషింగ్ బేసిన్, శానిటైజర్, సోప్ ఆయిల్, ప్రత్యేక వాటర్ సదుపాయం, ఫ్యాన్లు తదితర సదుపాయాలు కూడా ఉన్నాయి. బస్సులో ఈ క్లినిక్‌ను నిర్మించేందుకు రూ.50 వేలు ఖర్చు చేసినట్టు కేఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. కాగా కర్నాటకలో ఇప్పటి వరకు మొత్తం 489 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 153 మంది కరోనా బారి నుంచి కోలుకోగా, 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: అక్కడ షాపింగ్ చేయాలంటే మగాళ్లకే పర్మిషన్.. ఎందుకంటే..!



