AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా భయం.. పోలీసుల అదుపులో గోదావరి కుర్రాడు..

Coronavirus Scare: కరోనా ప్రభావంతో ఇప్పుడు ప్రజలు భయాందోళనలకు గురి చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమగోదావరికి చెందిన ఓ యువకుడిని ఎల్బీ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో స్థానికులు అతన్ని పట్టించారు. వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన మందపాటి నాని ఇవాళ దుబాయ్ నుంచి ముంబై వచ్చి.. అక్కడి క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకుని హైదరాబాద్ చేరుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఓ ప్రైవేట్ […]

కరోనా భయం.. పోలీసుల అదుపులో గోదావరి కుర్రాడు..
Ravi Kiran
|

Updated on: Mar 21, 2020 | 3:20 PM

Share

Coronavirus Scare: కరోనా ప్రభావంతో ఇప్పుడు ప్రజలు భయాందోళనలకు గురి చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమగోదావరికి చెందిన ఓ యువకుడిని ఎల్బీ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో స్థానికులు అతన్ని పట్టించారు. వివరాల్లోకి వెళ్తే..

వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన మందపాటి నాని ఇవాళ దుబాయ్ నుంచి ముంబై వచ్చి.. అక్కడి క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకుని హైదరాబాద్ చేరుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఓ ప్రైవేట్ బస్సులో నాని భీమవరం బయలుదేరగా.. తోటి ప్రయాణీకులు అతడి చేతికి ఉన్న ముద్రను చూసి ఆరా తీశారు. దీనితో యువకుడు కంగారు పడగా.. ప్రయాణీకులకు అనుమానం వచ్చి అతడ్ని బస్సు దించడమే కాకుండా పోలీసులకు అప్పగించారు. కాగా, పోలీసులు నానిని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు.

For More News:

డేంజర్ బెల్స్: తెలంగాణలో 19కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు…

కరోనా ఎఫెక్ట్.. పెన్షన్ల పంపణీపై జగన్ కీలక నిర్ణయం..

కరోనా వైరస్.. వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్లు..

కరోనా ప్రభావం.. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్…

కరోనావైరస్: రసికప్రియులకు బ్యాడ్ న్యూస్.. ‘ప్లేబాయ్’ మ్యాగజైన్ బంద్..

Breaking.. బస్సులు, మెట్రో బంద్..

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. ఎబోలా కంటే ప్రమాదకర స్థాయికి..

‘ఈరోస్ నౌ’ బంపరాఫర్.. 2 నెలలు ఫ్రీ సినిమాలు…

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్