Breaking: ఏపీలో ఒక్క రోజే 6,045 కరోనా కేసులు.. 65 మరణాలు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 49,553 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 6,045 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Breaking: ఏపీలో ఒక్క రోజే 6,045 కరోనా కేసులు.. 65 మరణాలు..
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 22, 2020 | 5:30 PM

 Coronavirus Positive Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 49,553 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 6,045 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 64,713కి చేరింది. ఇందులో 31,763 యాక్టివ్ కేసులు ఉండగా.. 32,127 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 823కి చేరింది.

మరోవైపు గడిచిన 24 గంటల్లో 6,494 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 65 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం 325, చిత్తూరు 345, ఈస్ట్ గోదావరి 891, గుంటూరు 842, కడప 229, కృష్ణ 151, కర్నూలు 678, నెల్లూరు 327, ప్రకాశం 177, శ్రీకాకుళం 252, విశాఖపట్నం 1049, విజయనగరం 107, వెస్ట్ గోదావరిలో 672 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో తూర్పుగోదావరి(8647), కర్నూలు(7797), అనంతపురం(6266) జిల్లాల్లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఎక్కువ కరోనా మరణాలు కర్నూలు(135), కృష్ణా(118) జిల్లాల్లో సంభవించాయి. కాగా, నేటి వరకు 14,35,827 సాంపిల్స్ ని పరీక్షించారు.