బంగ్లాదేశ్‌లో వరద బీభత్సం.. 54 మంది మృతి..
ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే మన దేశంలోని బిహార్, అసోం రాష్ట్రంలో వరదలు,భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇక మన..
ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే మన దేశంలోని బిహార్, అసోం రాష్ట్రంలో వరదలు,భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇక మన పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో కూడా వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వరదల దాటికి 54 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీవర్షాల వల్ల.. వచ్చిన వరదల్లో 2.4 మిలియన్ల మంది ఇబ్బందులు పడుతున్నారని.. 56వేల మందికి పైగా వరద ముంపుకు గురై నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. వీరిని ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ వెల్లడించారు. కరోనా కష్టకాలంలో వరదల దాటికి అల్లాడుతున్న బంగ్లాదేశ్‌ను ఆదుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు. వరదబాధితులను ఆదుకునేందుకు ఐక్యరాజ్యసమితి ద్వారా 5.2మిలియన్ల అమెరికా డాలర్ల అందజేసినట్లు డుజారిక్ తెలిపారు.