ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం ఖాళీ..
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం ఖాళీ చేయాలి అని ఆసుపత్రి ఇంచార్జ్ సూపరింటెండెంట్ నాయక్
Osmania general hospital: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం ఖాళీ చేయాలి అని ఆసుపత్రి ఇంచార్జ్ సూపరింటెండెంట్ నాయక్ సర్క్యూలర్ జారీ చేశారు. పాత భవనంలో ఉన్న రోగులతో సహా సామాగ్రిని తక్షణమే కొత్త భవనానికి తరలించాలని సూపరింటెండెంట్ ఆదేశాలిచ్చారు. పాత భవనాన్ని ఖాళీ చేసిన వెంటనే.. అధికారులు ఆ భవనాన్ని సీజ్ చేయనున్నారు. కాగా.. కొద్ది రోజుల క్రితం నగరంలో కురిసిన వర్షాలకు ఉస్మానియా ఆస్పత్రి పూర్తిగా నీటితో నిండిపోయిన విషయం విదితమే.
Also Read: నేటి నుంచి సంతలు బంద్.. రూల్స్ అతిక్రమిస్తే జరిమానా, కేసులు నమోదు..