గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రికవరీలు..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే అదే సమయంలో మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండటం ఊరటనిస్తోంది.
Coronavirus Outbreak Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే అదే సమయంలో మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండటం ఊరటనిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 49,259 పాజిటివ్ కేసులు ఉండగా.. అందులో 37,666 మంది(76 శాతం) కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక వీరిలో దాదాపు 15,000 మంది(30 శాతం) హోం క్వారంటైన్‌లో ఉండే చికిత్స పొందారని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 64,713 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 32,127 మంది(50 శాతం) కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా రికవరీలు శాతం క్రమంగా పెరుగుతుండటం శుభపరిణామం అని చెప్పాలి.
Also Read:
జగన్ సర్కార్ మరో సంచలనం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ..
Part 3: ”సుశాంత్‌ది హత్యేనా” ఆత్మ ఏం చెప్పింది.? షాకింగ్ వాస్తవాలు…