టిబెట్‌లో భూప్రకంపనలు.. భయం గుప్పిట్లో ప్రజలు..
ఓ వైపు యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంటే.. మరోవైపు ప్రకృతి కూడా పలు దేశాలపై పగబట్టినట్లు భయంబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో భారీ వర్షాలు, వరదలు, ఇతర ప్రమాదాలు..
ఓ వైపు యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంటే.. మరోవైపు ప్రకృతి కూడా పలు దేశాలపై పగబట్టినట్లు భయంబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో భారీ వర్షాలు, వరదలు, ఇతర ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక హిమాలయ పరిసర ప్రాంతాల్లోని ప్రదేశాల్లో నిత్యం ఎక్కడో ఓ చోట భూకంపం సంభవిస్తోంది. అయితే దీని తీవ్రత తక్కువగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా టిబెట్‌లో భూప్రకంపనలు వణికించాయి. దక్షిణ టిబెట్ ప్రాంతంలోని క్సిజాంగ్‌లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. గురువారం తెల్లవారు జామున 1.37 గంటలకు సంభవించినట్లు.. న్యూ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. నేపాల్ రాజధాని ఖాట్మండుకు ఉత్తరాన 38 మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదని అధికారులు తెలిపారు.అయితే భూ కంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు.. ప్రకంపనల తీవ్రత ఎక్కువ ఉండటంతో ప్రజలు వణికిపోయారు.
An earthquake of magnitude 6.2 struck Xizang, Tibet at 1:37 am today: National Center for Seismology pic.twitter.com/HbjFNpN0Nf
— ANI (@ANI) July 22, 2020