Coronavirus: ఈ లక్షణాలు ఉన్నా.. కరోనా వైరస్ సోకినట్లే..!
కరోనా పేషంట్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు సహజ లక్షణాలుగా కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి కొత్తగా రెండు లక్షణాలు చేర్చారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. బ్రిటన్‌కు చెందిన చెవి, ముక్కు, గొంతు డాక్టర్ల అధ్యయనంలో కరోనా పేషంట్లలలో పై లక్షణాలే కాకుండా మరో రెండు కొత్త వాటిని గుర్తించారు.
Coronavirus: ప్రస్తుతం ప్రపంచదేశాలను కరోనా వైరస్ మహమ్మారి గజగజలాడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 18 వేల మంది ఈ వ్యాధి బారిన పడి మృతి చెందగా.. ఆ సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా పేషంట్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు సహజ లక్షణాలుగా కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి కొత్తగా రెండు లక్షణాలు చేర్చారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. బ్రిటన్‌కు చెందిన చెవి, ముక్కు, గొంతు డాక్టర్ల అధ్యయనంలో కరోనా పేషంట్లలలో పై లక్షణాలే కాకుండా మరో రెండు కొత్త వాటిని గుర్తించారు. వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటివి కూడా కోవిడ్ 19 సోకిన బాధితుల్లో కనిపించాయని వారు చెబుతున్నారు.
దీనిపై బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్త హాప్‌కిన్స్ మాట్లాడుతూ.. తాజాగా కరోనా వైరస్ బారిన పడిన వారిపై రీసెర్చ్ చేయగా.. వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలను గుర్తించామని అన్నారు. ఇరాన్, దక్షిణ కొరియా, చైనా, ఇటలీలలో ఈ వ్యాధి సోకిన వారిని టెస్ట్ చేసినప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం ఇంతవరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని అన్నారు. అంతేకాకుండా ఈ విషయాన్ని వారు కొట్టిపారేయలేదని కూడా స్పష్టం చేశారు.
For More News:
కొత్తగూడెం పోలీస్ అధికారి, వంట మనిషికి కరోనా.. 39కి చేరిన కేసులు..
ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?
‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..
కరోనా మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 18 వేలు దాటిన మరణాలు..
దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..
కేటీఅర్ అన్నా.. మా ఊరికి పంపండి.. సోదరి విజ్ఞప్తి..
జక్కన్న అదిరిపోయే ఉగాది ట్రీట్.. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో విడుదల..