తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు..?
Coronavirus Effect: కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న రాత్రి కర్ఫ్యును ఈ నెల 31 తర్వాత కూడా కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో దానికి అనుగుణంగానే పొడిగించాలని సీఎం కేసిఆర్ ఆలోచిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీనిపై ఒకటి లేదా రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడి, లాక్ డౌన్, కర్ఫ్యూ […]
Coronavirus Effect: కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న రాత్రి కర్ఫ్యును ఈ నెల 31 తర్వాత కూడా కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో దానికి అనుగుణంగానే పొడిగించాలని సీఎం కేసిఆర్ ఆలోచిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీనిపై ఒకటి లేదా రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
రాష్ట్రంలో కరోనా కట్టడి, లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు విషయాలపై సీఎం గురువారం ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. జనాలు ఎక్కువగా బయట తిరితే కరోనాను కట్టడి చేయడం అసాధ్యమని.. కర్ఫ్యూ, లాక్ డౌన్ మరింత పకడ్బందీగా అమలు చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగించాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
For More News:
కరోనా కల్లోలం.. చైనాను దాటేసిన అమెరికా..
కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఏ టైంకు ఏవి దొరుకుతాయి..?
కరోనా వైరస్ గురించి పాప్ స్టార్ ముందే ఊహించారట.?