కరోనా కల్లోలం.. చైనాను దాటేసిన అమెరికా..

Coronavirus Effect: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5 లక్షలపైగా కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 24 వేలు దాటిపోయింది. వుహన్‌లో పురుడుపోసుకున్న కరోనా వైరస్‌ను చైనా అసాధారణ స్థాయిలో కట్టుదిట్టం చేసినా.. అగ్రరాజ్యం అమెరికా, యూరోప్ దేశాల్లో మాత్రం కరోనా విజృంభణ తీవ్రతరం అయింది. ఈ రెండు దేశాల్లోనూ అధునాతన టెక్నాలజీలతో ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉన్నా.. ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోతూ […]

కరోనా కల్లోలం.. చైనాను దాటేసిన అమెరికా..
Follow us

|

Updated on: Mar 27, 2020 | 9:38 AM

Coronavirus Effect: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5 లక్షలపైగా కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 24 వేలు దాటిపోయింది. వుహన్‌లో పురుడుపోసుకున్న కరోనా వైరస్‌ను చైనా అసాధారణ స్థాయిలో కట్టుదిట్టం చేసినా.. అగ్రరాజ్యం అమెరికా, యూరోప్ దేశాల్లో మాత్రం కరోనా విజృంభణ తీవ్రతరం అయింది. ఈ రెండు దేశాల్లోనూ అధునాతన టెక్నాలజీలతో ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉన్నా.. ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోతూ ఉండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

కరోనా వైరస్ అమెరికాను బెంబేలెత్తిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే అక్కడ పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. దీనితో సుమారు 33 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఇక డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీరి కోసం 2.2 లక్షల కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు అమెరికాలో ఇప్పటివరకు 85 వేలు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1200 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం కేసుల సంఖ్యలో అగ్రరాజ్యం చైనాను దాటేసింది.

దీనితో ఇప్పటికైనా అమెరికా లాక్ డౌన్ ప్రకటించాలని.. లేదంటే ఈ కరోనాను కట్టడి చేయడం కష్టమవుతుందని వివిధ రాష్ట్రాల గవర్నర్లు హెచ్చరిస్తున్నారు. అటు కరోనా వైరస్‌తో ఇటలీలో మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. నిన్న ఒక్కరోజులోనే 712 మంది మృతి చెందగా.. దీనితో మొత్తం మృతుల సంఖ్య 8,215కు చేరుకుంది. అటు కేసులు కూడా 80 వేలు దాటిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

For More News:

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు..?

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఏ టైంకు ఏవి దొరుకుతాయి..?

కరోనా వైరస్ గురించి పాప్ స్టార్ ముందే ఊహించారట.?

కరోనా విలయం.. స్విట్జర్లాండ్‌కు ఫెదరర్ భారీ సాయం..

దోమకాటుతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా..?

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.