గుడ్ న్యూస్.. ఏపీలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. పెరిగిన రికవరీ శాతం..

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,728 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,49,705కి చేరింది.

గుడ్ న్యూస్.. ఏపీలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. పెరిగిన రికవరీ శాతం..
Follow us
Ravi Kiran

| Edited By: Team Veegam

Updated on: Nov 13, 2020 | 4:54 AM

Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,728 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,49,705కి చేరింది. ఇందులో 20,857 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,22,011 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 9 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,837కు చేరుకుంది. ఇక నిన్న 1,777 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 89.40 సాంపిల్స్‌ను పరీక్షించారు….

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 99, చిత్తూరు 206, తూర్పుగోదావరి 290, గుంటూరు 212, కడప 85, కృష్ణా 223, కర్నూలు 36, నెల్లూరు 91, ప్రకాశం 88, శ్రీకాకుళం 43, విశాఖపట్నం 74, విజయనగరం 42, పశ్చిమ గోదావరి 239 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,19,791కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 804 మంది కరోనాతో మరణించారు.