AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వ్యాప్తికి వీరే కారణం : డబ్ల్యూహెచ్ఓ

కరోనా వ్యాప్తి కారకాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తాజాగా ప్రకటన చేసింది. యువత, మధ్యవయసు వారి ద్వారానే కరోనా వ్యాప్తి అధికంగా జరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ వెస్ట్రన్ పెసిఫిక్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ తకేషి కసాయి మంగళవారం నాడు తెలిపారు.

కరోనా వ్యాప్తికి వీరే కారణం : డబ్ల్యూహెచ్ఓ
Balaraju Goud
|

Updated on: Aug 18, 2020 | 3:10 PM

Share

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో పుట్టిన వైరస్ విశ్వవ్యాప్తం అయ్యింది. నిన్న పెద్దా తేడా లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలను అంటుకుంటుంది. పట్టణాలల్లో మొదలై పల్లె ప్రాంతాలకు విస్తరించింది. అయితే, కరోనా వ్యాప్తి కారకాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తాజాగా ప్రకటన చేసింది. యువత, మధ్యవయసు వారి ద్వారానే కరోనా వ్యాప్తి అధికంగా జరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ వెస్ట్రన్ పెసిఫిక్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ తకేషి కసాయి మంగళవారం నాడు తెలిపారు. ఇరవై నుంచి యాభై ఏళ్ల లోపు వారు తమకు తెలీకుండానే కరోనా బారినపడుతున్నారన్నారు. ఆరోగ్యం ఉన్నామనుకుని వివిధ ప్రాంతాల్లో ప్రయాణించడం మూలాల కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమకు కరోనా సోకిందన్న విషయం వీరిలో అనేక మందికి తెలియదని చెప్పారు. ఈ పరిస్థితి వృద్ధులకు, అనారోగ్యంగా ఉన్నవారికి ఇది పెద్ద ప్రమాదకరంగా మారుతుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్య వ్యవస్థ అందుబాటులో లేని ప్రాంతాలు, జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజల మధ్య భౌతిక దూరం పాటిస్తూ కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Follow Us