ఏపీలో ఇక ‘ఆ‘ టెస్టులు ప్రైవేటులో కూడా… జగన్ కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కరోనా వైరస్ పరీక్షలను ప్రైవేటు ల్యాబులు, ఆసుపత్రుల్లోను నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది జగన్ సర్కార్. కోవిడ్ టెస్టులను ప్రైవేట్ ల్యాబుల్లోను నిర్వహించేందుకు అనుమతులు మంజూరు చేస్తు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కరోనా వైరస్ పరీక్షలను ప్రైవేటు ల్యాబులు, ఆసుపత్రుల్లోను నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది జగన్ సర్కార్. కోవిడ్ టెస్టులను ప్రైవేట్ ల్యాబుల్లోను నిర్వహించేందుకు అనుమతులు మంజూరు చేస్తు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ మేరకు తమకు పరీక్షల నిర్వహణ సామర్థ్యం వున్నట్లుగా ల్యాబులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేయాల్సి వుంటుంది.
ప్రపోజల్ సబ్మిట్ చేయాలని అర్హత గల ప్రైవేట్ ల్యాబులకు సూచిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులను విడుదల చేసింది. కేవలం ఎన్ఏబిఎల్ మరియు ఐసీఎంఆర్ గుర్తించిన ల్యాబ్స్‌కు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుండి వస్తున్న వారిలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన సమయంలో ప్రభుత్వం పంపే శాంపిల్స్ సైతం పరీక్షించాలని ప్రైవేటు ల్యాబులను ప్రభుత్వం కోరనున్నది. ప్రైవేట్ శాంపిల్స్‌కి ధరను సైతం ఖరారు చేసింది ప్రభుత్వం. ఒక్కో పరీక్షకు కేవలం రూ.2,900 మాత్రమే వసూలు చేసేలా ఉత్తర్వులిచ్చారు.




