కోర్టులో క‌రోనా క‌ల‌క‌లం…. 233 మంది క్వారంటైన్ కు..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్ సబార్డినేట్ కోర్టులోకి క‌రోనా వైర‌స్‌ ప్రవేశించింది. ఇక్కడ

కోర్టులో క‌రోనా క‌ల‌క‌లం.... 233 మంది క్వారంటైన్ కు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 30, 2020 | 7:51 AM

Corona entry in Jodhpur court: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్ సబార్డినేట్ కోర్టులోకి క‌రోనా వైర‌స్‌ ప్రవేశించింది. ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురు జ్యుడిషియల్ ఆఫీసర్లు కరోనా బారిన పడినట్లు తేలింది‌. దీంతో మొత్తం 233 జ్యుడిషియల్ ఆఫీసర్లు, సబార్డినేట్ కోర్టుల ఉద్యోగుల నుంచి కరోనా పరీక్షల కోసం నమూనాలను సేక‌రించారు. అనంత‌రం ఈ జ్యుడిషియల్ ఆఫీసర్లు, ఉద్యోగులందరినీ క్వారంటైన్‌కు త‌ర‌లించారు.

వివరాల్లోకెళితే.. రాజ‌స్థాన్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జోధ్‌పూర్‌‌కు చెందిన అడిషిన‌ల్ డిస్ట్రిక్ట్ జ‌డ్జి స్థాయికి చెందిన ముగ్గురు జ్యుడిషియల్ అధికారులకు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో కోర్టులో క‌ల‌క‌లం చెల‌రేగింది. దీంతో కోర్టుతో సంబంధం ఉన్న అంద‌రినీ క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఈ కార‌ణంగా సబార్డినేట్ కోర్టు జ్యుడిషియల్ పనులు వాయిదా పడ్డాయి. జూన్ ఒకటి‌ నుండి అన్‌లాక్ ప్ర‌క‌టించ‌డంతో జోధ్‌పూర్‌లో కరోనా కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతూ వ‌స్తోంది.